Pavithra Gowda: జైల్లో ఉన్నా పవిత్రకు మేకప్ వేసుకోవడానికి అనుమతి.. చిక్కుల్లో పోలీసులు..

|

Jun 26, 2024 | 1:17 PM

సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ద్వారా తనకు అసభ్యకరంగా సందేశాలు పంపుతూ.. తనను వేధించాడనే కోపంతో తన ప్రియుడు దర్శన్ తో కలిసి రేణుకాస్వామిని కిడ్నాప్ చేసి హత్య చేయించింది పవిత్ర గౌడ. ప్రస్తుతం బెంగుళూరు పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు. అయితే దర్శన్, పవిత్ర కొన్నిరోజులుగా జైలులో ఉన్నారు. జైల్లో ఉన్న పవిత్రకు మేకప్ వేసుకోవడానికి అనుమతించిన పోలీసులు ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు.

Pavithra Gowda: జైల్లో ఉన్నా పవిత్రకు మేకప్ వేసుకోవడానికి అనుమతి.. చిక్కుల్లో పోలీసులు..
Pavithra Gowda
Follow us on

రేణుకస్వామి మర్డర్ కేసు కన్నడ సినీ పరిశ్రమలో పెను దుమారం రేపింది. ఈకేసులో హీరో దర్శన్, అతడి ప్రియురాలు నటి పవిత్ర గౌడతోపాటు మరో 17 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వీరంతా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ద్వారా తనకు అసభ్యకరంగా సందేశాలు పంపుతూ.. తనను వేధించాడనే కోపంతో తన ప్రియుడు దర్శన్ తో కలిసి రేణుకాస్వామిని కిడ్నాప్ చేసి హత్య చేయించింది పవిత్ర గౌడ. ప్రస్తుతం బెంగుళూరు పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు. అయితే దర్శన్, పవిత్ర కొన్నిరోజులుగా జైలులో ఉన్నారు. జైల్లో ఉన్న పవిత్రకు మేకప్ వేసుకోవడానికి అనుమతించిన పోలీసులు ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు.

ఇటీవల విచారణ సమయంలో రాజేశ్వరి నగర్ లోని తన ఇంటికెళ్లి మేకప్ వేసుకుని బయటకు వచ్చింది పవిత్ర. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితురాలి పట్ల ఇంత నిర్లాక్ష్యంగా ఉంటారా ? అంటూ నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు విజయనగరం మహిళా పోలీస్ స్టేషన్ లేడీ ఎస్ఐ నేత్రావతికి పశ్చిమ డివిజన్ డీసీపీ గిరీష్ నోటీసులు జారీ చేశారు. పోలీసుల కస్టడీలో ఉన్న పవిత్ర గౌడను జూన్ 15న లేడీ ఎస్ఐ నేత్రావతిని తీసుకుని ఇంటికి వెళ్లింది పవిత్ర.. కస్టడీలో ఉన్న పవిత్ర ఇంటికి వెళ్లిన పవిత్ర తిరిగి వచ్చేప్పుడు మాత్రం ఫుల్ మేకప్ వేసుకుని..పెదాలకు లిప్ స్టిక్ వేసుకుని బయటకు వచ్చింది. ఇందుకు సంబంధించిన ఫోటోస్ వైరలయ్యాయి.

ఇలాగే జైలులో ఉన్న పవిత్రా తనకు భోజనం నచ్చలేదని.. ఇంటి నుంచి భోజనం, దుప్పటి తెప్పించాలంటూ డిమాండ్స్ చేస్తుందట. దీంతో పోలీసులు ఆమెకు గట్టిగానే కౌన్సిలింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నను చూసేందుకు కుటుంబం నుంచి ఎవరూ రావడం లేదని వాపోయింది పవిత్ర. ఇటీవలే ఆమె కూతురు పవిత్రను పరామర్శించింది. లైసెన్స్ పిస్టల్‌ను స్వాధీనం చేసుకోవాలని నటుడు దర్శన్, ప్రదోష్‌లకు నోటీసులు అందాయి. లోక్‌సభ ఎన్నికల సమయంలో లైసెన్సు పొంది ఆయుధాలు అందజేయాల్సి వచ్చింది. అయితే పిస్టల్‌ను తిరిగి ఇవ్వకుండా నటులు దర్శన్, ప్రదోష్‌లకు మినహాయింపు ఇచ్చారు. ఇప్పుడు రేణుకాస్వామి హత్య కేసు విచారణ నేపథ్యంలో ఆయన తుపాకీని జప్తు చేయాలని నోటీసు ఇచ్చారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.