మహేశ్‌కు షోకాజ్ నోటీసులు జారీ

| Edited By:

Feb 20, 2019 | 8:36 AM

టాలీవుడ్‌ సూపర్‌స్టార్ మహేశ్ బాబు మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. జీఎస్టీ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారన్న ఆరోపణలపై రంగారెడ్డి జిల్లా జీఎస్టీ యాంటీ ఫ్రాపిటీరింగ్ వింగ్ మహేశ్ బాబుకు నోటీసులు జారీ చేసింది. ఏఎం‌‌బీ పేరుతో మహేశ్ బాబు కొత్త థియేటర్‌ను ప్రారంభించగా.. అందులో ఆయన జీఎస్టీ నిబంధనలు ఉల్లంఘించారని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా100రూ.లు, దానికన్నా తక్కువ ఉన్న టికెట్లపై జీఎస్టీని 18శాతం పెడుతూ అప్పట్లో కేంద్రం నిర్ణయం తీసుకుంది. కానీ తాజాగా వాటిపై 6శాతం తగ్గిస్తూ 12శాతం […]

మహేశ్‌కు షోకాజ్ నోటీసులు జారీ
Follow us on

టాలీవుడ్‌ సూపర్‌స్టార్ మహేశ్ బాబు మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. జీఎస్టీ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారన్న ఆరోపణలపై రంగారెడ్డి జిల్లా జీఎస్టీ యాంటీ ఫ్రాపిటీరింగ్ వింగ్ మహేశ్ బాబుకు నోటీసులు జారీ చేసింది. ఏఎం‌‌బీ పేరుతో మహేశ్ బాబు కొత్త థియేటర్‌ను ప్రారంభించగా.. అందులో ఆయన జీఎస్టీ నిబంధనలు ఉల్లంఘించారని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.

కాగా100రూ.లు, దానికన్నా తక్కువ ఉన్న టికెట్లపై జీఎస్టీని 18శాతం పెడుతూ అప్పట్లో కేంద్రం నిర్ణయం తీసుకుంది. కానీ తాజాగా వాటిపై 6శాతం తగ్గిస్తూ 12శాతం జీఎస్టీని ఫిక్స్ చేశారు. జనవరి 1వ తేది నుంచి ఈ కొత్త రేట్లు అమలులోకి వచ్చాయి. అయితే మహేశ్ బాబు నిర్వహిస్తోన్న ఏఎంబీ సినిమాస్ మాత్రం పాత రేట్ల ప్రకారమే టికెట్లు అమ్ముతున్నారని అధికారులు కనుగొన్నారు. దీంతో మహేశ్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసిన అధికారులు.. కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.