AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీదేవి లేకుండా సీక్వెల్.. తన వల్ల కాదన్న దర్శకుడు

శ్రీదేవి లేకుండా ఆ మూవీని తాను తెరకెక్కించలేనని మరోసారి స్పష్టం చేశారు బాలీవుడ్ దర్శకుడు శేఖర్ కపూర్. అనిల్ కపూర్, శ్రీదేవి జంటగా ఈ దర్శకుడు 1987లో ‘మిస్టర్ ఇండియా’ చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. అప్పట్లో విమర్శల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం.. ఘన విజయం సాధించింది. అయితే ఈ మూవీకి సీక్వెల్‌పై మరోసారి వార్తలు వచ్చాయి. ఇటీవల శేఖర్ కపూర్‌తో కలిసి ఉన్న ఓ ఫొటోను షేర్ చేసిన అనిల్ కపూర్.. దానికి కామెంట్‌గా […]

శ్రీదేవి లేకుండా సీక్వెల్.. తన వల్ల కాదన్న దర్శకుడు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 22, 2019 | 5:11 PM

Share

శ్రీదేవి లేకుండా ఆ మూవీని తాను తెరకెక్కించలేనని మరోసారి స్పష్టం చేశారు బాలీవుడ్ దర్శకుడు శేఖర్ కపూర్. అనిల్ కపూర్, శ్రీదేవి జంటగా ఈ దర్శకుడు 1987లో ‘మిస్టర్ ఇండియా’ చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. అప్పట్లో విమర్శల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం.. ఘన విజయం సాధించింది. అయితే ఈ మూవీకి సీక్వెల్‌పై మరోసారి వార్తలు వచ్చాయి. ఇటీవల శేఖర్ కపూర్‌తో కలిసి ఉన్న ఓ ఫొటోను షేర్ చేసిన అనిల్ కపూర్.. దానికి కామెంట్‌గా మిస్టర్ ఇండియా సీక్వెల్‌ను ప్రస్తావించాడు. దీంతో ఈ సీక్వెల్ తెరకెక్కనుందంటూ జోరుగా ప్రచారం జరిగింది.

అయితే దీనిపై తాజాగా స్పందించిన శేఖర్ కపూర్.. ‘‘శ్రీదేవి మరణించారు. మిస్టర్ ఇండియా 2 కూడా లేనట్లే. ఆమె లేకుండా ఈ చిత్రాన్ని ఊహించుకోలేను. అనిల్ ఒప్పుకున్నా.. ఈ చిత్ర నిర్మాత బోని కపూర్ ఉద్దేశం కూడా నాకు తెలీదు. కానీ ఆ సీక్వెల్‌కు మాత్రం నేను దర్శకత్వం వహించలేను. ఆమె లేకుండా ఈ సీక్వెల్ సాధ్యం కాదు’’ అంటూ పేర్కొన్నారు. కాగా మిస్టర్ ఇండియా చిత్రంలో శ్రీదేవి నటన మరవలేనిది. ఆ పాత్రలో ఆమెను తప్ప మరెవరినీ ఊహించుకోలేమన్నది సినీ ఇండస్ట్రీ ఎరిగిన సత్యం. ఈ నేపథ్యంలోనే ఆమె లేకుండా తాను ఈ సినిమాను తీయలేనని దర్శకుడు శేఖర్ కపూర్ తేల్చి చెప్పారు.

Follow Us
తన బిడ్డను చంపిందని.. పులిని ఫారెస్ట్‌ అధికారులకు పట్టించిన ఆవు..
తన బిడ్డను చంపిందని.. పులిని ఫారెస్ట్‌ అధికారులకు పట్టించిన ఆవు..
హీరోలతో పోటీ పడాలనుకున్నాడు.. చివరకు నన్నే వదిలేశాడు..
హీరోలతో పోటీ పడాలనుకున్నాడు.. చివరకు నన్నే వదిలేశాడు..
ఇది తెలుసా.! మిగతా పాములతో పోలిస్తే కింగ్ కోబ్రా ఇందుకే స్పెషల్..
ఇది తెలుసా.! మిగతా పాములతో పోలిస్తే కింగ్ కోబ్రా ఇందుకే స్పెషల్..
వెల్లుల్లి నూనె రహస్యాలు.. చర్మ రోగాలకు గుడ్‌బై, నల్లటి జుట్టు
వెల్లుల్లి నూనె రహస్యాలు.. చర్మ రోగాలకు గుడ్‌బై, నల్లటి జుట్టు
ఫస్ట్ నైట్ స్పెషల్ మాడుగుల హల్వా ఇది.. ఒక్కసారి తిన్నారనుకోండి.!
ఫస్ట్ నైట్ స్పెషల్ మాడుగుల హల్వా ఇది.. ఒక్కసారి తిన్నారనుకోండి.!
బరువు తగ్గడానికి ఈజీ ట్రిక్.. ఓట్స్ అసలు ఎలా తినాలో తెలుసా..?
బరువు తగ్గడానికి ఈజీ ట్రిక్.. ఓట్స్ అసలు ఎలా తినాలో తెలుసా..?
ఏసీ Vs కూలర్.. సమ్మర్‌లో ఏది బెస్ట్..? కొనేముందు ఈ లెక్కలు పక్కా
ఏసీ Vs కూలర్.. సమ్మర్‌లో ఏది బెస్ట్..? కొనేముందు ఈ లెక్కలు పక్కా
బ్యాంక్‌లో బంగారం పోతే బాధ్యత ఎవరిది?
బ్యాంక్‌లో బంగారం పోతే బాధ్యత ఎవరిది?
పెళ్లి, సంతాన సమస్యలా..? ఈ ప్రత్యేక ఆలయాన్ని ఒక్కసారి దర్శిస్తే..
పెళ్లి, సంతాన సమస్యలా..? ఈ ప్రత్యేక ఆలయాన్ని ఒక్కసారి దర్శిస్తే..
పాకిస్తాన్, కెనడా కంటే దారుణంగా టీమిండియా పరిస్థితి.. అదేంటంటే?
పాకిస్తాన్, కెనడా కంటే దారుణంగా టీమిండియా పరిస్థితి.. అదేంటంటే?