
‘బాహుబలి’ తరువాత ప్రభాస్ నటిస్తోన్న మరో భారీ బడ్జెట్ చిత్రం ‘సాహో’. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ముంబయిలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆ మూవీ సెట్స్‌కు వెళ్లి సందడి చేశారు కేంద్రమంత్రి నితిన్ కడ్కరీ. ఈ సందర్భంగా అక్కడి తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ ఫొటోలలో నితిన్ గడ్కరీతో ప్రభాస్, శ్రద్ధా కపూర్, దర్శకుడు సుజీత్‌లు ఉన్నారు.
కాగా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ‘సాహో’పై భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తోడు ఇప్పటికే విడుదలైన రెండు టీజర్లు సినిమాపై అంచనాల్ని పెంచేశాయి. కాగా యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి బాలీవుడ్ త్రయం శంకర్-ఇషాన్-లాయ్ సంగీతం అందిస్తున్నారు. ఆగష్టులో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా మూవీ యూనిట్ సన్నాహాలు చేస్తోంది.