నితిన్ మూవీ నుంచి క్రేజీ అప్‏డేట్.. ఆ రోజున ‘చెక్’ పెట్టడానికి సిద్ధంగా ఉన్న చిత్రయూనిట్.. 

|

Jan 30, 2021 | 11:02 AM

టాలీవుడ్‏లో సినిమా విడుదల తేదీలను ప్రకటిస్తూ.. ప్రేక్షకులకు సినీ ఫెస్టివల్ రుచిని చూపిస్తున్నారు దర్శకులు. ఇప్పటికే చిరంజీవి, ప్రభాస్, అల్లు అర్జున్,

నితిన్ మూవీ నుంచి క్రేజీ అప్‏డేట్.. ఆ రోజున చెక్ పెట్టడానికి సిద్ధంగా ఉన్న చిత్రయూనిట్.. 
Follow us on

Check Movie Update: టాలీవుడ్‏లో సినిమా విడుదల తేదీలను ప్రకటిస్తూ.. ప్రేక్షకులకు సినీ ఫెస్టివల్ రుచిని చూపిస్తున్నారు దర్శకులు. ఇప్పటికే చిరంజీవి, ప్రభాస్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, గోపీచంద్ తమ సినిమాల విడుదల తేదీలను ప్రకటించారు. వీటితోపాటే ట్రైలర్లు, పోస్టర్లు విడుదల చేస్తూ.. మరింత ఆసక్తిని రేపుతున్నారు. తాజాగా యంగ్ హీరో నితిన్ కూడా తన సినిమా అప్‏డేట్‏ను అందించాడు.

ప్రస్తుతం నితిన్ చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా చెక్. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్‏కు విశేషస్పందన లభించింది.  తాజాగా నితిన్ చెక్ మూవీ ట్రైలర్‏ను ఫిబ్రవరి 3వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రయూనిట్ ప్రకటించింది. చెస్ బ్యాక్ డ్రాప్‏లో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చివరిదశకు చేరుకుంది.