పవన్‌ మూవీ కోసం నితిన్‌ కీలక నిర్ణయం..!

మలయాళంలో మంచి విజయం సాధించిన అయ్యప్పనుమ్ కోషియమ్‌ను తెలుగులో రీమేక్‌ చేస్తున్న విషయం తెలిసిందే.

పవన్‌ మూవీ కోసం నితిన్‌ కీలక నిర్ణయం..!

Edited By:

Updated on: Nov 01, 2020 | 11:14 AM

Ayyappanum Koshiyum Remake: మలయాళంలో మంచి విజయం సాధించిన అయ్యప్పనుమ్ కోషియమ్‌ను తెలుగులో రీమేక్‌ చేస్తున్న విషయం తెలిసిందే. మలయాళంలో బిజు పోషించిన పాత్రను తెలుగులో పవన్‌ కల్యాణ్‌ చేస్తున్నారు. ఇక పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రలో నితిన్‌, సాయి ధరమ్‌ తేజ్‌ పేర్లు వినిపిస్తున్నాయి. (బిచ్చగత్తె కాదు మిలియనీర్‌: బయటపడ్డ దొంగవేషం.. యాచకురాలు అరెస్ట్‌)

ఇక తన దేవుడిగా భావించే పవర్‌ స్టార్ మూవీలో ఆఫర్ అనేసరికి నితిన్‌ చాలా సంతోషపడ్డాడట. అంతేకాదు ఈ మూవీ కోసం ఎలాంటి రెమ్యునరేషన్ లేకుండా నటించేందుకు నితిన్ రెడీ అయ్యారట. మరోవైపు ఈ పాత్ర కోసం సాయి ధరమ్‌ తేజ్‌ కూడా రెడీగా ఉన్నట్లు సమాచారం. వీరిద్దరిలో ఎవరో ఒకరిని పవన్ కల్యాణ్ ఫైనల్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇందులో పవన్ భార్యగా సాయి పల్లవి ఖరారైనట్లు టాక్. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. ( ప్రభాస్ ‘ఆదిపురుష్’‌.. సీతగా ఆ ఇద్దరిలో ఒకరు..!)