దగ్గరపడుతున్న పెళ్లి డేట్.. ఉదయ్‌పూర్‌లో అడుగెట్టిన మెగా డాటర్‌ నిహారిక

మెగా డాటర్‌ నిహారిక కొణిదెల పెళ్లి డేట్ దగ్గరపడుతోంది. డిసెంబర్ 9న చైతన్యతో మూడు మూళ్లు వేయించుకోబోతోంది నిహారిక.

దగ్గరపడుతున్న పెళ్లి డేట్.. ఉదయ్‌పూర్‌లో అడుగెట్టిన మెగా డాటర్‌ నిహారిక

Edited By:

Updated on: Nov 18, 2020 | 12:12 PM

Niharika Konidela marriage: మెగా డాటర్‌ నిహారిక కొణిదెల పెళ్లి డేట్ దగ్గరపడుతోంది. డిసెంబర్ 9న చైతన్యతో మూడు మూళ్లు వేయించుకోబోతోంది నిహారిక. ఇక వీరి వివాహం ఉదయ్‌పూర్‌లోని ప్రముఖ హోటల్‌లో జరగబోతోంది. ఈ క్రమంలో అక్కడ పనులు శరవేగంగా జరుగుతుండగా.. వాటిని చూసుకునేందుకు నిహారిక ఉదయ్‌పూర్‌ వెళ్లారు. అక్కడ దిగిన వెంటనే ఫొటో తీసుకున్న నిహారిక.. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. (ఢిల్లీలో మళ్లీ లాక్‌డౌన్‌.. స్పందించిన డిప్యూటీ సీఎం మనీష్‌ శిశోడియా)

కాగా పెళ్లి సమయం దగ్గరపడుతున్న క్రమంలో త్వరలోనే ఇరు కుటుంబ సభ్యులు ఉదయ్‌పూర్‌కి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో కొన్ని రోజులు పాటు వారు అక్కడ క్వారంటైన్‌లో ఉండనున్నట్లు సమాచారం. ఇక ఈ వివాహ వేడుకకు కేవలం ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఇక నిహారిక పెళ్లి కోసం మెగా హీరోలందరూ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌లు రెడీ చేస్తున్నట్లు టాక్‌. (నటి గౌతమి ఇంట్లోకి చొరబడి.. గోడ కింద దాక్కొని.. ఆందోళన కలిగించిన వ్యక్తి)