
సిల్వర్ స్క్రీన్ అయినా.. డిజిటల్ ఫ్లాట్ ఫారమ్ అయినా కథ, కథనం బాగుంటే చాలు.. ప్రేక్షకులు ఇట్టే కనెక్ట్ అయిపోతారు. అందుకు ఉదాహరణే దర్శకుడు మహి వి రాఘవ్. తాజాగా ఆయన షో రన్నర్ గా వ్యవహరించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 2 బ్లాక్ బస్టర్ గా నిలిచింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే మొదటి వారంలోనే వ్యూయర్షిప్ పరంగా దూసుకుపోతోంది. ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 1 బ్లాక్ బస్టర్ కాగా, ఆ తర్వాత వచ్చిన ‘షైతాన్’ సూపర్ హిట్ అయ్యింది. తాజాగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 2 బ్లాక్ బస్టర్ కావడంతో మహీ హ్యాట్రిక్ విజయాలను నమోదు చేశాడు.
అయితే ఇది టాలీవుడ్ లో రేర్ ఫిట్. నిర్మాత, దర్శకుడు మహి తన బ్యానర్ మూడు చిత్రాలకు షో రన్నర్ గా వ్యవహరించి హిట్ రికార్డును సొంతం చేసుకున్నాడు. వరుస సూపర్ హిట్లను అందిస్తూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్నాడు. ఈ సందర్భంగా ఆయన రియాక్ట్ అయ్యారు. ‘‘మంచి రెస్పాన్స్ ఇచ్చిన ప్రేక్షకులకు థాంక్స్. ప్రేక్షకుల తమ దైనందిన జీవితంలో ప్రతిధ్వనించే అంశాలను బాగా చూపించడంతో కనెక్ట్ అయ్యారు. కామెడీని ఎమోషనల్ తో ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ గా అందించడంతో ఓటీటీలో మా వెబ్ సిరీస్ లకు మంచి ఆదరణ వస్తోంది.
ఒక రచయితగా నేను ఎల్లప్పుడూ సొసైటీలో పాతుకుపోయిన కథలను చెప్పడానికి ఇష్టపడతాను. తద్వారా ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు”, అని మహి వి రాఘవ్ చెప్పారు. లాంగ్ ఫార్మాట్ కథాంశాల్లో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడానికి కామెడీ కీలకమని, నా బ్యానర్ వరుసగా వచ్చిన వెబ్ సిరీస్ లు ఆకట్టుకుంటుండటంతో తో పాటు టాలీవుడ్ లో బిగ్ రెస్పాన్స్ వచ్చిందని ఆయన అన్నారు. వరుసగా హ్యాట్రిక్ కొట్టినందుకు ఆనందంగా ఉందన్నారాయన.