‘గజినీ’తో గుణపాఠం – నయనతార

|

May 10, 2019 | 1:20 PM

2005లో రిలీజైన ‘గజినీ’ సినిమా అన్ని భాషల్లోనూ ఘన విజయం సాధించింది. ఈ సినిమాలో లేడి సూపర్ స్టార్ నయనతార సెకండ్ హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఈ అమ్మడు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘గజిని’ సినిమా చేయడం తన జీవితంలో తీసుకున్న చెత్త నిర్ణయమని పేర్కొంది. దర్శకుడు మురుగదాస్ కథ చెప్పినప్పుడు తన పాత్ర గురించి ఒకలా చెప్పి.. చివరికి సిల్వర్ స్క్రీన్‌పై మరోలా చూపించారంటూ నయన్ ఆవేదన చెందింది. అంతేకాకుండా మల్టీ […]

గజినీతో గుణపాఠం - నయనతార
Follow us on

2005లో రిలీజైన ‘గజినీ’ సినిమా అన్ని భాషల్లోనూ ఘన విజయం సాధించింది. ఈ సినిమాలో లేడి సూపర్ స్టార్ నయనతార సెకండ్ హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఈ అమ్మడు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘గజిని’ సినిమా చేయడం తన జీవితంలో తీసుకున్న చెత్త నిర్ణయమని పేర్కొంది.

దర్శకుడు మురుగదాస్ కథ చెప్పినప్పుడు తన పాత్ర గురించి ఒకలా చెప్పి.. చివరికి సిల్వర్ స్క్రీన్‌పై మరోలా చూపించారంటూ నయన్ ఆవేదన చెందింది. అంతేకాకుండా మల్టీ స్టారర్ సినిమాలు చేస్తున్నప్పుడు వాటిని చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలన్న గుణపాఠం ‘గజినీ’ సినిమా ద్వారా స్పష్టమైందని నయన్ తెలిపింది.

నయన్ ప్రస్తుతం రజినీకాంత్ హీరోగా మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ‘దర్బార్’ సినిమాలో నటిస్తోంది. మరోవైపు శివ కార్తికేయన్ తో జోడి కట్టిన ‘మిస్టర్ లోకల్’ మే 21న విడుదలకు సిద్ధమవుతోంది.