‘జెర్సీ’ ట్రైలర్ వచ్చేసింది..

| Edited By:

Apr 12, 2019 | 1:55 PM

నేచురల్ స్టార్ నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో వస్తున్న చిత్రం ‘జెర్సీ’. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్. కాగా.. ఈ సినిమా ట్రైలర్‌ను శుక్రవారం విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇందులో అర్జున్ అలియాస్ నాని క్రికెటర్ పాత్రలో కనిపించాడు. క్రికెటర్‌గా అర్జున్ గ్రౌండ్‌లోకి అడుగుపెట్టడం, ఇతర ఆటగాళ్లతో గొడవ పెట్టుకోవడం, శ్రద్ధాతో ప్రేమలో పడటం, ఇలా నానీ హ్యాపీగా […]

జెర్సీ ట్రైలర్ వచ్చేసింది..
Follow us on

నేచురల్ స్టార్ నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో వస్తున్న చిత్రం ‘జెర్సీ’. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్. కాగా.. ఈ సినిమా ట్రైలర్‌ను శుక్రవారం విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇందులో అర్జున్ అలియాస్ నాని క్రికెటర్ పాత్రలో కనిపించాడు. క్రికెటర్‌గా అర్జున్ గ్రౌండ్‌లోకి అడుగుపెట్టడం, ఇతర ఆటగాళ్లతో గొడవ పెట్టుకోవడం, శ్రద్ధాతో ప్రేమలో పడటం, ఇలా నానీ హ్యాపీగా ఉన్న మూమెంట్స్‌తో ట్రైలర్ స్టార్ట్ అయింది. అయితే.. పదేళ్ల తరువాత తర్వాత అర్జున్ క్రికెట్‌కు దూరమై, ఉద్యోగం లేక,  కుటుంబాన్ని పోషించలేక, కొడుకు అడిగినవి కొని ఇవ్వలేక సతమతం అవుతుంటాడు. ఇక అప్పుడే తన కొడుకు కోసమన్నా మళ్లీ క్రికెట్‌లోకి వెళ్లాలనుకుంటాడు అర్జున్. అయితే.. అర్జున్ పదేళ్ల పాటు క్రికెట్‌కు ఎందుకు దూరమయ్యాడు..? ఆ తరువాత చోటు చేసుకున్న సంఘటనలు ఏంటి..? అనేది మాత్రం థియేటర్‌లో చూడాల్సిందే. ఈ సినిమాకు అనిరుథ్ రవిచందర్ సంగీతం అందించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగ వంశి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.