ఇంట్రెస్టింగ్ పాత్రలో నటించనున్న నందమూరి హీరో.. అలనాటి కాంబినేషన్ మళ్ళీ రిపీట్ ?..

|

Dec 28, 2020 | 12:01 PM

గతంలో సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు వంటి సూపర్ హిట్ విజయాలను అందించిన డైరెక్టర్ గోపాల్ బి. అప్పట్లో నందమూరి బాలకృష్ణతో

ఇంట్రెస్టింగ్ పాత్రలో నటించనున్న నందమూరి హీరో.. అలనాటి కాంబినేషన్ మళ్ళీ రిపీట్ ?..
Follow us on

గతంలో సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు వంటి సూపర్ హిట్ విజయాలను అందించిన డైరెక్టర్ గోపాల్ బి. అప్పట్లో నందమూరి బాలకృష్ణతో కలిసి గోపాల్ తెరకెక్కించిన సినిమాలు బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని అందుకున్నాయి. ఆ తర్వాత మెల్లగా బి.గోపాల్ సినిమాల సంఖ్య తగ్గుతూ వచ్చింది. ఇటీవల కాలంలో ఈ డైరెక్టర్ సినిమాలకు కాస్తా దూరంగా ఉంటూ వచ్చారు. అయితే తాజా సమాచారం ప్రకారం మళ్ళీ బాలయ్యతో కలిసి ఓ యాక్షన్ సినిమా తీయబోతున్నట్లుగా ఫిల్మ్ నగర్లో వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం సాయి మాధవ్ బుర్ర మరియు ఆకుల శివతోపాటు యంగ్ డైరెక్టర్లతో కలిసి బి.గోపాల్ బాలయ్య కోసం ఓ కథను సిద్దం చేసే పనిలో ఉన్నాడట. ఈ సినిమాలో బాలకృష్ణను గూడఛారిగా చూపించే ప్రయత్నం చేయనున్నట్లు తెలుస్తోంది. మంచి యాక్షన్ ఎంటర్ టైనర్‏గా ఈ మూవీ తెరకెక్కించనున్నారట గోపాల్. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.