బాలయ్య కొత్త సినిమా టైటిల్ ఏంటో తెలుసా..?

|

Jun 14, 2019 | 1:18 PM

ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రం తరువాత బాలయ్య మరో సినిమాను ప్రారంభించారు. 2018లో జై సింహా చిత్రంతో హిట్ కొట్టిన బాలయ్య .. ఆ చిత్ర దర్శకుడు కేఎస్ రవికుమార్‌తో కాంబినేషన్ రిపీట్ చేశారు. ఈ చిత్రానికి రూలర్ అనే టైటిల్ ఖరారు చేశారు. సీకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లో సి. కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. హైదరాబాద్​లో జరిగిన పూజా కార్యక్రమానికి దర్శకులు బోయపాటి శ్రీను, వి.వి.వినాయక్, కోదండరామిరెడ్డి తదితరులు హాజరయ్యారు. […]

బాలయ్య కొత్త సినిమా టైటిల్ ఏంటో తెలుసా..?
Follow us on

ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రం తరువాత బాలయ్య మరో సినిమాను ప్రారంభించారు. 2018లో జై సింహా చిత్రంతో హిట్ కొట్టిన బాలయ్య .. ఆ చిత్ర దర్శకుడు కేఎస్ రవికుమార్‌తో కాంబినేషన్ రిపీట్ చేశారు. ఈ చిత్రానికి రూలర్ అనే టైటిల్ ఖరారు చేశారు. సీకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లో సి. కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. హైదరాబాద్​లో జరిగిన పూజా కార్యక్రమానికి దర్శకులు బోయపాటి శ్రీను, వి.వి.వినాయక్, కోదండరామిరెడ్డి తదితరులు హాజరయ్యారు. జూలై నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. త్వ‌ర‌లోనే ఇత‌ర న‌టీన‌టుల వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది.