ఈ అక్కా చెల్లెల్లు బాలీవుడ్‌లో ఒకప్పుడు హీరోయిన్లు .. వీరిలో ఒకరు మన స్టార్ హీరో భార్య.. ఎవరో గుర్తు పట్టగలరా

ఓ ఇద్దరు అక్కా చెల్లెలు సినీ పరిశ్రమలో హీరోయిన్లు.. ఆ అక్కాచెల్లుల్లు ఇటీవలే తండ్రితో ఉన్న ఫోటోను షేర్ చేసి నాన్నతో అనుబంధనాన్ని గుర్తు చేసుకున్నారు.. మరి ఆ అక్కాచెల్లెల్లో ఒకరు మన టాలీవుడు స్టార్ హీరో భార్య..

ఈ అక్కా చెల్లెల్లు బాలీవుడ్‌లో ఒకప్పుడు హీరోయిన్లు .. వీరిలో ఒకరు మన స్టార్ హీరో భార్య.. ఎవరో గుర్తు పట్టగలరా

Updated on: Feb 16, 2021 | 5:45 PM

Sister Duos In Bollywood: చిన్నతనపు జ్ఞాపకాలు ఎప్పటికీ మధురమే.. అవి సెలబ్రెటీలకైనా.. సామాన్యులకైనాసరే.. అయితే సెలబ్రెటీల విషయంలో అయితే అందరికీ మరింత ఇంట్రస్ట్. వాళ్ళ చిన్న తనంలోని ఫోటోలను చూస్తే చెప్పలేనంత ఆసక్తి.. ఓ ఇద్దరు అక్కా చెల్లెలు సినీ పరిశ్రమలో హీరోయిన్లు.. ఆ అక్కాచెల్లుల్లు ఇటీవలే తండ్రితో ఉన్న ఫోటోను షేర్ చేసి నాన్నతో అనుబంధనాన్ని గుర్తు చేసుకున్నారు.. మరి ఆ అక్కచెల్లెల్లో ఒకరు మన టాలీవుడు సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత శిదోర్కర్.

మహేష్ బాబు ని పెళ్లి చేసుకోకముందు నమ్రత మోడల్ మిస్ ఇండియా..నటి కూడా.. బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాల్లో నటించింది .. చేసింది కొన్ని సినిమాలే అయినా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది నమ్రత.. అయితే మహేష్ బాబు పెళ్లి చేసుకున్న తర్వాత భార్యగా తల్లిగా కుటుంబ భాద్యతలు చేసుకుంటుంది..

అయితే నమ్రత అక్క కూడా సినీ నటినే ఆమె శిల్పా శిదోర్కర్.. బాలీవుడ్ లో స్టార్ హీరోలకు జోడీగా సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ‘హమ్’, ‘గోపీ కిషన్’, కిషన్ కన్హయ్య’ బేవాఫా సనమ్’ వంటి అనేక హిట్ సినిమాల్లో శిల్పా నటించింది. అంతేకాదు తెలుగులో కూడా మోహన్ బాబు తో బ్రహ్మ సినిమాలో నటించింది. శిల్ప కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే 2000 సంవత్సరంలో బ్రిటన్‌కు చెందిన అపరేష్ రంజిత్‌ను వివాహం చేసుకుంది. సినీ పరిశ్రమకు గుడ్ బై చెప్పేసింది. అయితే 2013లో ‘ఏక్ ముట్టి ఆస్మాన్’ అనే సీరియల్‌ తో బుల్లి తెరపై కనిపించింది.

ఇటీవలే దుబాయ్ లో కరోనా నివారణ కు వ్యాక్సిన్ తీసుకుని .. ఈ వ్యాక్సిన్ తీసుకున్న తొలి భారతీయ నటిగా శిల్పా శిదోర్కర్ నిలిచిన సంగతి తెలిసిందే.. అయితే ఇటీవలే ఈ సిస్టర్స్ తమ తండ్రిని పోగొట్టుకుని 14 ఏళ్ళు అయ్యిందని తండ్రి జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికగా గుర్తు చేసుకున్నారు.

Also Read:

‘ఆ ప్రాజెక్ట్‌ను అఖిల్ కోసమే ఓకే చేశాను’.. మోనాల్ గజ్జర్ ఆసక్తికర వ్యాఖ్యలు..

మిథున్ చక్రవర్తితో ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్ భేటీ, మాది ఆధ్యాత్మిక ‘మైత్రి’ అంటున్న డ్యాన్సింగ్ స్టార్