
అక్కినేని నాగార్జున.. నాగేశ్వరరావు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా ఎదిగారు. సినిమాల్లో హీరోగానే కాకుండా నిర్మాతగా, స్టూడియో అధినేతగా, బిజినెస్ మ్యాన్‌గా పాపులారిటీ తెచ్చుకున్నారు. తాజాగా ఆయన చేసిన కామెంట్లు ఇండస్ట్రీలోనే కాకుండా వ్యాపారాలు చేసే వారిని కూడా టెన్షన్ పడేలా చేస్తున్నాయి.
టాలీవుడ్ పరిశ్రమను ఏళ్లుగా పట్టిపీడిస్తున్న పైరసీ భూతానికి చెక్ పెట్టారు తెలంగాణ పోలీసులు. ప్రముఖ పైరసీ వెబ్‌సైట్ ‘ఐబొమ్మ’ (iBomma) నిర్వాహకుడిని అరెస్టు చేశారు. 2019 నుంచి ఆపరేట్ అవుతున్న ఈ సైట్, బాలీవుడ్, టాలీవుడ్, హాలీవుడ్ సినిమాలతో పాటు OTT కంటెంట్‌ను అప్‌లోడ్ చేసి, పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించింది. హార్డ్ డిస్కుల్లో 21,000 మూవీలు, 50 లక్షల మంది యూజర్ల పర్సనల్ డేటా దొంగిలించినట్టు గుర్తించారు.
గ్యాంబ్లింగ్ యాడ్స్ ద్వారా రూ.20 కోట్ల సంపాదనలో రూ.3 కోట్లు సీజ్ చేసి మిగిలిన ఖాతాలు ఫ్రీజ్ చేశారు.ఐబొమ్మ నిర్వాహకుడు ఫ్రాన్స్, కరీబియన్ దేశాల నుంచి 65 మిర్రర్ సైట్లు, 900కి పైగా వెబ్‌సైట్లు ఆపరేట్ చేశాడు. థియేటర్లలో సీక్రెట్‌గా ఫిల్మింగ్ చేసి, క్రిప్టోకరెన్సీల ద్వారా డబ్బులు సంపాదించాడు. ఫ్లాట్లు కొనుగోలు చేశాడు. అరెస్టు తర్వాత విచారణలో, యూరప్, ఆసియా, కరీబియన్‌లోని ఆపరేటర్ల నెట్‌వర్క్‌ను ఉపయోగించినట్టు ఒప్పుకున్నాడు.
Nagarjuna & Shobitha
సెప్టెంబర్ 2025లో ఐదుగురు ఆపరేటర్ల అరెస్టు తర్వాత కూడా, నిర్వాహకుడు పోలీసును చాలెంజ్ చేసి, ‘క్యాచ్ మీ ఇఫ్ యు క్యాన్’ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కానీ, డివోర్స్ కోసం ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చిన వెంటనే అరెస్ట్ అయ్యాడు. భార్య ఇచ్చిన లీక్‌తో పోలీసులకు క్లూ వచ్చినట్లు సమాచారం.
ఈ అరెస్టును టాలీవుడ్ సెలబ్రిటీలు ఘనంగా స్వాగతం పలికారు. చిరంజీవి, నాగార్జున, ఎస్ఎస్ రాజమౌళి, దిల్ రాజు, సురేష్ బాబు సజ్జనార్‌తో సమావేశమై, పోలీసుల చర్యలను ప్రశంసించారు. చిరంజీవి మాట్లాడుతూ.. ‘పైరసీ వల్ల ‘గేమ్ చేంజర్’, ‘OG’, ‘తండేల్’, ‘కింగ్‌డమ్’ సినిమాలు బాక్సాఫీస్‌లో నష్టపోయాయి. రవి పోలీసులను ఓపెన్‌గా చాలెంజ్ చేయడం దారుణం. ఇది ఇండస్ట్రీకి గొప్ప రిలీఫ్’ అన్నారు. రాజమౌళి మాట్లాడుతూ.. ‘పైరసీ సైట్లు ట్రాప్. మీ డేటా దొంగిలించి, ఫైనాన్షియల్ ఫ్రాడ్‌కు గురిచేస్తాయి’ అని హెచ్చరించారు.
ఈ క్రమంలో నాగార్జున చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ‘నా కుటుంబ సభ్యులు 6-7 నెలల క్రితం రెండు రోజులు ‘డిజిటల్ అరెస్ట్’కు గురయ్యారు. సైబర్ ఫ్రాడ్‌స్టర్లు ఫేక్ మూవీ లింక్‌ల ద్వారా డేటా తీసుకుని, డిజిటల్ ‘అరెస్ట్’ అని భయపెట్టి డబ్బు డిమాండ్ చేశారు’ అని సంచలన కామెంట్లు చేశారు.
డిజిటల్ అరెస్టైంది శోభిత ధూళిపాళ గురించి అంటూ రూమర్లకు దారితీసింది. ఆమె సోషల్ మీడియాలో ఇనాక్టివ్‌గా ఉండటంతో, నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. నాగార్జున క్లారిటీ ఇవ్వకపోవటంతో ఆ వార్త వైరల్ అయ్యింది. అయితే, ఈ కేసు టాలీవుడ్‌కు మాత్రమే కాదు, భారతీయ సినిమా పరిశ్రమకు పాఠం. సినిమా లింకులు, గ్యాంబ్లింగ్ లింకులతో ప్రజల ఆర్థిక నష్టాలు, ప్రాణాలు కూడా పోతున్నాయి. ప్రజలు ఇకనైనా అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం.