గాయాలు మానకున్నా.. షూటింగ్‌కు వెళ్లిన నాగశౌర్య

కొత్త దర్శకుడు రమణ తేజ దర్శకత్వంలో నాగశౌర్య ఓ చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. తన సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ ఈ మూవీని నిర్మిస్తోంది. అయితే ఈ మూవీ షూటింగ్‌లో ఆ మధ్యన నాగశౌర్య గాయపడటంతో చిత్రీకరణను కాస్త బ్రేక్ ఇచ్చారు దర్శకనిర్మాతలు. కాలు జాయింట్ దగ్గర నరాలు చిట్లడంతో నాగశౌర్య దాదాపు నెల రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అయితే ఇంకా నెల రోజులు గడవకముందే షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు ఈ హీరో. ప్రస్తుతం […]

గాయాలు మానకున్నా.. షూటింగ్‌కు వెళ్లిన నాగశౌర్య

Edited By:

Updated on: Jul 04, 2019 | 12:48 PM

కొత్త దర్శకుడు రమణ తేజ దర్శకత్వంలో నాగశౌర్య ఓ చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. తన సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ ఈ మూవీని నిర్మిస్తోంది. అయితే ఈ మూవీ షూటింగ్‌లో ఆ మధ్యన నాగశౌర్య గాయపడటంతో చిత్రీకరణను కాస్త బ్రేక్ ఇచ్చారు దర్శకనిర్మాతలు. కాలు జాయింట్ దగ్గర నరాలు చిట్లడంతో నాగశౌర్య దాదాపు నెల రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అయితే ఇంకా నెల రోజులు గడవకముందే షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు ఈ హీరో.

ప్రస్తుతం వైజాగ్‌లో ఈ మూవీ షూటింగ్ జరుగుతుండగా.. అందులో భాగంగా యాక్షన్ సన్నివేశంలో నటించేందుకు సిద్ధమయ్యాడు నాగశౌర్య. తన తోటి నటుల డేట్లకు ఇబ్బంది కలగకుండా ఉండాలని భావించిన ఈ యువ హీరో.. గాయం పూర్తిగా మానకముందే షూటింగ్‌కు వెళ్లాడు. కాగా ఈ చిత్రంలో శౌర్య సరసన మెహ్రీన్ నటిస్తుండగా శ్రీచరణ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ ఏడాదే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. కాగా సమంత నటించిన ఓ బేబిలో నాగశౌర్య కీలక పాత్రలో కనిపించాడు. ఈ చిత్రం రేపు(శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానుంది.