Love story movie: నాగ చైతన్య ‘లవ్ స్టోరీ’ థియేటర్స్‏లోకి వచ్చేదీ అప్పుడే ? ప్లాన్ చేస్తున్న మూవీ మేకర్స్…

|

Jan 23, 2021 | 8:57 PM

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం నటిస్తున్న చిత్రం 'లవ్ స్టోరీ'. ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తుండగా.. ఫిదా ఫేం సాయి పల్లవి హీరోయిన్‏గా నటిస్తోంది. ఫిదా సినిమా

Love story movie: నాగ చైతన్య లవ్ స్టోరీ థియేటర్స్‏లోకి వచ్చేదీ అప్పుడే ? ప్లాన్ చేస్తున్న మూవీ మేకర్స్...
Follow us on

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘లవ్ స్టోరీ’. ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తుండగా.. ఫిదా ఫేం సాయి పల్లవి హీరోయిన్‏గా నటిస్తోంది. ఫిదా సినిమా తర్వాత శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న చిత్రం లవ్ స్టోరీ కావడంతో ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ కూడా విశేష స్పందన లభించింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను వేసవిలో విడుదల చేయాలని భావిస్తున్నాడట డైరెక్టర్. ఏప్రిల్ 2న థియేటర్లలోకి ఈ సినిమాను తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడనున్నట్లుగా తెలుస్తోంది.

ఇక ఇప్పటికే విడుదలైన టీజర్ వీడియోలో సాయి పల్లవి, నాగచైతన్య ఇద్దరు తెలంగాణ యాసలో మాట్లాడుతూ..  జీవితంలో ఎదో సాధించాలని పల్లెను వదిలి సిటీకి వచ్చిన యువకుడిగా చైతన్య కనిపించనున్నాడని టీజర్ చూస్తే అర్ధమవుతుంది. ఇక సాయి పల్లవి కూడా ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసే అమ్మాయిగా కనిపించనుంది. ఈ సినిమాను నారాయణ్‌ దాస్‌ నారంగ్, పి. రామ్మోహన్‌ రావ్‌ నిర్మించారు.

Also Read: