Devisree Prasad: నూతన సంవత్సరంలో అదరగొట్టనున్న మ్యూజిక్ కింగ్ దేవిశ్రీ ప్రసాద్.. సంక్రాంతి నుంచే బరిలోకి..

Devisree Prasad: టాలీవుడ్‌లో చెప్పుకోదగ్గ సంగీత దర్శకుల్లో దేవిశ్రీ ప్రసాద్ మొదటి వరుసలో ఉంటారు. అయితే కరోనా

Devisree Prasad: నూతన సంవత్సరంలో అదరగొట్టనున్న మ్యూజిక్ కింగ్ దేవిశ్రీ ప్రసాద్.. సంక్రాంతి నుంచే బరిలోకి..

Updated on: Jan 02, 2021 | 1:24 PM

Devisree Prasad: టాలీవుడ్‌లో చెప్పుకోదగ్గ సంగీత దర్శకుల్లో దేవిశ్రీ ప్రసాద్ మొదటి వరుసలో ఉంటారు. అయితే కరోనా నామ సంవత్సరమైన 2020లో దేవి పెద్దగా సత్తాచూపలేకపోయాడు. ఉప్పెన పాట, సరిలేరు నీకెవ్వరూ మినహా మిగతా ప్రాజెక్ట్‌లు ఏవి చేపట్టలేదు. సహచర సంగీత దర్శకులతో పోటీ పడలేకపోయాడు. కానీ నూతన సంవత్సరం 2021లో మొత్తం దేవిశ్రీ హవానే కొనసాగేలా ఉంది.

చాలా సినిమాలు చేతిలో ఉన్నాయి. గతేడాది తమన్ ఓ ఊపు ఊపేస్తే ఈ ఏడాది దేవిశ్రీ హవా నడుస్తున్నట్లుగా కనిపిస్తోంది. రాక్ స్టార్. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ సంక్రాంతికి విడుదల అవుతుంది. అప్పటి నుంచే తన మాయ మొదలు పెడుతున్నాడు. గతంలో బెల్లంకొండ హీరోగా వచ్చిన అల్లుడు శీను, జయ జానకి నాయక సినిమాలకు సంగీతం అందించాడు దేవి. ఆ తర్వాత వరుసగా నితిన్ రంగ్ దే, ఉప్పెన సినిమాలు రానున్నాయి. ఇక చాలా రోజుల తర్వాత రవితేజ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా రూపొందుతున్న ఖిలాడీ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్లో అప్పట్లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇదే కాంబినేషన్లో రాబోయే సినిమాకు కూడా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Loading...
Unable to load recommendations.
Follow Us