
Rhea Chakraborthy news: సుశాంత్ సింగ్ మృతి కేసు, డ్రగ్స్ మాఫియాలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి రియా చక్రవర్తికి మరోసారి షాక్ తగిలింది. బెయిల్ కావాలంటూ ఆమె దరఖాస్తు చేసుకున్న పిటిషన్ విచారణను ముంబయి హైకోర్టు వాయిదా వేసింది. భారీ వర్షాలతో ముంబయి హైకోర్టు సెలవులో ఉండగా.. ఈ పిటిషన్ విచారణను గురువారం చేపట్టనున్నట్లు హైకోర్టు వెల్లడించింది. మరోవైపు ఆమె జ్యుడీషియల్ కస్టడీని పెంచుతూ మంగళవారం ఎన్‌డీపీఎస్ కోర్టు తీర్పు తెలిపింది. దీంతో అక్టోబర్ వరకు ఆమె జైలులోనే ఉండాల్సి ఉంది. కాగా మరోవైపు డ్రగ్స్ కేసులో బాలీవుడ్‌లో పలువురి పేర్లు బయటికొస్తున్నాయి. ఈ క్రమంలో మరికొంతమందికి ఎన్సీబీ సమన్లు జారీ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Read more:
రేణు దేశాయ్ వెబ్ సిరీస్‌కి ఆసక్తికర టైటిల్