
టాలీవుడ్‌లో ఒకప్పుడు స్పెషల్ సాంగ్స్‌కు చిరునామాగా నిలిచిన నటి ముమైత్ ఖాన్, తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిన ఓ విషాదకర సంఘటనను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. సుదీర్ఘ విరామం తర్వాత మీడియా ముందుకు వచ్చిన ఆమె, తన గత అనుభవాలు, ప్రమాదం, కోమా, జ్ఞాపకశక్తి కోల్పోవడం, అలాగే జీవితం పట్ల తన ప్రస్తుత దృక్పథాన్ని పంచుకున్నారు. ఓ రోజు షవర్ తీసుకుని బయటకు వచ్చి బార్డ్రోబ్ వైపు వెళ్తుండగా, అద్దంలో తనను తాను చూసుకుని బాగున్నానని భావించినట్లు ముమైత్ తెలిపారు. వెనక్కి వెళ్తున్న సమయంలో ఆమె కాలు జారి కిందపడిపోయింది. ఆమె బెడ్‌రూమ్‌లోని ఇటాలియన్ బెడ్ చాలా లో సైజులో ఉంటుందని, దాని అంచులు పదునుగా ఉంటాయని వివరించారు. ఆమె తలకు ఆ పదునైన అంచులు తగలడంతో మూడు నరాలు తెగి, అంతర్గత రక్తస్రావం జరిగిందని చెప్పారు. మొదట్లో ఆమెకు అంత తీవ్రత అర్థం కాలేదు. తన తల్లికి తాను ఆసుపత్రికి వెళ్లాలని చెప్పినప్పుడు, షూటింగ్ తప్పించుకోవడానికి నటిస్తున్నానని తల్లి భావించిందని ముమైత్ గుర్తు చేసుకున్నారు.
రెండు మూడు రోజుల పాటు తలకు లోపల రక్తస్రావం అవుతూనే ఉండగా, మూడవ రోజున ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాక, ఆమె పరిస్థితి విషమించడంతో 15 రోజుల పాటు కోమాలోకి వెళ్లారు. “ఒక్క రోజు ఆలస్యం అయినా తీవ్రమైన ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉండేది” అని డాక్టర్లు చెప్పారని ముమైత్ తెలిపారు. అదృష్టవశాత్తు, ఆమె కోమా నుంచి బయటపడి, ప్రాణాపాయం నుండి కోలుకున్నారు. ముంబైలోని ఒక ఆసుపత్రిలో ఆమెకు ఆపరేషన్ జరిగింది. ఈ సంఘటనను గుర్తు చేసుకుంటున్నప్పుడు ముమైత్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయని యాంకర్ అడిగినప్పుడు, ఆమె దాన్ని ఖండించారు. “అవి కన్నీళ్లు కావు, ఉదయం నుండి అలసిపోవడం వల్ల, కాజల్ వల్ల కళ్ళు అలా ఉన్నాయి. నాకు ఎలాంటి దుఃఖం లేదు” అని ఆమె స్పష్టం చేశారు.
ఈ ప్రమాదం తర్వాత ముమైత్ ఖాన్ జీవితం పూర్తిగా మారిపోయింది. ఆమె జ్ఞాపకశక్తిని కోల్పోయారు. గతంలో జరిగిన సంఘటనలు, తాను కలిసి పనిచేసిన వ్యక్తులు, నార్మల్ సంభాషణలు, మునుపటి జీవితంలోని చాలా విషయాలు ఆమెకు గుర్తులేవు. రామ్ చరణ్, అల్లు అర్జున్, చిరంజీవి, మహేష్ బాబు వంటి ప్రముఖులతో తాను పనిచేసినప్పటికీ, వారిలో కొందరితో మాత్రమే తనకు పని చేసినట్లు గుర్తుందని, చాలామంది గుర్తులేరని ఆమె చెప్పారు. తాను పనిచేసిన హరికృష్ణ, ప్రభాస్, మహేష్ బాబు పేర్లను మాత్రం గుర్తు చేసుకున్నారు.
తన జ్ఞాపకశక్తి లోపం కారణంగా, బయటి ప్రజలు ఆమెను అహంకారిగా, గర్వంగా ఉన్న వ్యక్తిగా భావిస్తున్నారని, అందుకే వారి పట్ల అలా ప్రవర్తిస్తున్నారని అనుకుంటున్నారని ముమైత్ తెలిపారు. అయితే, తాను ఎవరికీ సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదని, తన కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు తన ఆరోగ్య పరిస్థితి, మెంటల్ హెల్త్ గురించి తెలుసని ఆమె స్పష్టం చేశారు. “నాకు సింపతీ అవసరం లేదు. ఎందుకు వివరణ ఇవ్వాలి? ఒకసారి వివరణ ఇస్తే మళ్ళీ మళ్ళీ ఇవ్వాల్సి వస్తుంది” అని ఆమె అన్నారు.
ఈ ప్రమాదాన్ని ఒక పాఠంగా, దేవుడిచ్చిన విరామంగా ముమైత్ ఖాన్ భావిస్తున్నారు. 13 సంవత్సరాల వయస్సు నుండి 32 సంవత్సరాల వరకు నిరంతరం పనిచేసానని, తన తల్లిదండ్రులు పేదరికంలో మరణించకూడదనే ఏకైక ఉద్దేశ్యంతో కష్టపడ్డానని తెలిపారు. జీవితంలో బిల్లులు ఎలా చెల్లించాలి, సాధారణ ప్రజలతో ఎలా మాట్లాడాలి, బయటి ప్రపంచం ఎలా ఉంటుంది వంటి విషయాలు తనకు తెలియవని చెప్పారు. ఈ విరామం తనకు బయటి ప్రపంచాన్ని, మానవ సంబంధాలను, ఒక వ్యక్తిగా ఎలా ఎదగాలో నేర్పిందని ముమైత్ ఖాన్ అన్నారు. ఈ కఠినమైన సమయంలో తన కుటుంబ సభ్యుల మద్దతు తనకు చాలా బలంగా నిలిచిందని, తన ఆరోగ్యం చాలా ముఖ్యమని ఆమె చెప్పారు.
ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: రహస్య బావిలో మహిళ అరుపులు.. భయంతో వణికిపోవాల్సిందే.. ఓటీటీని ఊపేస్తున్న హారర్ థ్రిల్లర్..
ఎక్కువ మంది చదివినవి : Sowcar Janaki: షావుకారు జానకి మనవరాలు తెలుగులో పెద్ద హీరోయిన్.. చాలా ఫేమస్.. ఎవరో