
మూవీ రివ్యూ: అరి
నటీనటులు: వినోద్ వర్మ, అనసూయ భరద్వాజ్ , సాయి కుమార్, వైవా హర్ష, శ్రీకాంత్ అయ్యాంగార్, సుభలేఖ సుధాకర్ తదితరులు
సంగీతం: అనూప్ రుబెన్స్
సినిమాటోగ్రఫీ: జీ కృష్ణ ప్రసాద్
దర్శకుడు: జయశంకర్
ఇక్కడ మీ కోరికలు తీర్చబడతాయి అనే ఒక మిస్టీరియస్ యాడ్‌తో మొదలై . ఏడుగురు వ్యక్తుల జీవితాలు ఎలా మారుతాయో చూపిస్తుంది. వీరిలో కోటీశ్వరుడు విప్రనారాయణ (సాయి కుమార్) నుంచి.. ఎయిర్ హోస్టెస్ ఆత్రేయి (అనసూయ), వృద్దుడు గుంజన్ (శుభలేఖ సుధాకర్), చైతన్య అనే పోలీస్ అధికారి (శ్రీకాంత్ అయ్యంగార్), టీ అమ్ముకునే అమూల్ కుమార్ (వైవా హర్ష) ఇలా అందరూ ఆ ప్రకటన చూసి అటువైపు పరుగులు పెడతారు. వాళ్లందరూ వీక్నెస్ చూసి ఆడుకునే వ్యక్తి (వినోద్ వర్మ). ఈ పాత్రలు, వాళ్ళ అంతర్గత కలహాలు, అరిషడ్వర్గానికి లింక్ అయి, కోరికలు-పరిణామాల మధ్య నడిచేదే ఈ సినిమా కథ. ఎండింగ్‌లో శ్రీకృష్ణుడి రివీల్ థ్రిల్‌ను పెంచుతుంది. అదేంటన్నది స్క్రీన్ మీద చూడాలి..
నిజం చెప్పాలంటే పెద్ద సినిమాల కంటే చిన్న సినిమాల్లో వచ్చే కాన్సెప్ట్ లు చాలా అద్భుతంగా ఉంటాయి. తాజాగా అరి సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. ఇది ఇండియన్ సినిమాల్లో అరుదైన కాన్సెప్ట్.. రీమేక్ పొటెన్షియల్ కలిగి ఉంది. మనిషిని లోపల నుంచి డిసైడ్ చేసే కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాట్సర్యం చుట్టూ తిరిగే యూనివర్సల్ కాన్సెప్ట్‌తో రూపొందిన సైకో-మైథాలజికల్ థ్రిల్లర్ ఈ సినిమా. ఆ అరిషడ్వర్గాలను ఆధునిక పాత్రలతో లింక్ చేసి చూపించడం ఇన్నోవేటివ్. ప్రతి పాత్ర పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కథ సాగటం ఆసక్తికరంగా ఉంది. కామెడీ టోన్‌తో కొన్ని సీన్స్, ఇంటర్వల్ సీక్వెన్స్, క్లైమాక్స్ ఇవన్నీ బాగానే రాసుకున్నాడు దర్శకుడు జయశంకర్.
ఇచ్చట కోరికలు తీర్చబడును అనే ప్రకటనను చూసి అక్కడికి రావడం.. అందులో ఒక్కొక్క క్యారెక్టర్ తో మన లోపల ఉన్న ఒక్కొక్క ఎలిమెంట్ తీసుకొని కామ క్రోధ మదమాత్సల్యం అంటూ అలాంటి సన్నివేశాలు లింక్ చేస్తూ కథ చెప్పడం కొత్తగా అనిపిస్తుంది. కాన్సెప్ట్ బాగానే ఉన్నా కూడా రాసుకున్న స్క్రీన్ ప్లే అందరికీ అర్థమవుతుంది అని క్లారిటీ లేదు. అది ఈ సినిమాకు ఉన్న మెయిన్ మైనస్. దానికి తోడు అరిషడ్వర్గాలు అనే కాన్సెప్ట్ట్ ఈ జనరేషన్ ఆడియన్స్‌కు సులభంగా అర్థం కాకపోవచ్చు. ఎక్స్‌ప్లనేషన్ ఇంకా డీప్‌గా ఉంటే మెరుగ్గా ఉండేది. సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్స్ స్లో అనిపిస్తుంది. కొన్ని సీన్స్ ఇంకా పాలిష్ చేస్తే బాగుండేది. ఓవరాల్ గా ఒక డిఫరెంట్ సినిమా చూసాం అనే ఫీలింగ్ అయితే తెపిస్తుంది ఇది.
వినోద్ వర్మా కాలమ్‌గా గైడ్ పాత్రలో బాగా నటించాడు. సాయి కుమార్ లోభం-మోహం షేడ్స్‌తో డామినేట్ చేస్తాడు. అనసూయ కామం ఎలిమెంట్‌తో బోల్డ్‌గా మెరిసింది. శ్రీకాంత్ అయ్యంగార్, వైవా హర్ష మంచి మార్క్ చూపించారు. మిగిలిన వాళ్ళందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
ఇలాంటి సైకలాజికల్ థ్రిల్లర్ కు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కీలకం. ఈ విషయంలో అనుప్ రుబెన్స్ తనవంతు న్యాయం చేశాడు. రీ రికార్డింగ్ స్కోర్ థ్రిల్‌ను పెంచుతుంది. జీ కృష్ణ ప్రసాద్ అందించిన సినిమాటోగ్రఫీ సినిమా మూడ్ సెట్ చేస్తుంది. ఎడిటింగ్ పర్లేదు. పేపర్ బాయ్ దర్శకుడు జయశంకర్ కొత్త ప్రయత్నం చేశాడు.
ఓవరాల్ గా అరి.. మైథాలజీ సైకాలజీ మిక్స్ చేసిన డిఫరెంట్ థ్రిల్లర్..!