టైటిల్ : మజిలీ
తారాగణం : నాగ చైతన్య, సమంతా, దివ్యాన్ష కౌశిక్, పోసాని కృష్ణ మురళి, రావు రమేష్ తదితరులు
సంగీతం : గోపి సుందర్, ఎస్.ఎస్.తమన్
దర్శకత్వం : శివ నిర్వాణ
నిర్మాణ బ్యానర్ : షైన్ స్క్రీన్ క్రియేషన్స్
ఇంట్రడక్షన్: పెళ్లి తర్వాత అక్కినేని నాగ చైతన్య, సమంతా కలిసి జంటగా నటిస్తున్న చిత్రం ‘మజిలీ’. దివ్యాన్ష కౌశిక్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకుడు.ఇక ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఈ రివ్యూ లో చూద్దాం.
కథ :
పూర్ణ(నాగ చైతన్య)కు టీనేజ్ నుంచి క్రికెట్ అంటే పిచ్చి ఇష్టం. ఇక ఆ టైంలో పూర్ణకు అన్షు(దివ్యాన్ష)తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారుతుంది. అయితే పూర్ణ కెరీర్ సాఫీగా సాగుతున్న తరుణంలో అన్షు దూరమైపోతుంది. అప్పుడే వ్యసనాలకు బానిసైన పూర్ణ జీవితంలోకి శ్రావణి(సమంతా) వస్తుంది. శ్రావణికి భర్తే సర్వస్వం. భర్త ఏమి చేసినా, ఎలా ఉన్నా గుడ్డిగా భర్తకే సపోర్ట్ చేస్తుంది. అలాంటి వీరి జీవితాల్లోకి అనుకోకుండా మీరా అనే పాప వస్తుంది. ఆ పాప కారణంగా వాళ్ళ జీవితాలు ఎలా మారాయి..? శ్రావణి తన భర్తను మార్చుకోగలిగిందా..? ఈ భార్యాభర్తల కథ ఏ మజిలీకి చేరుకుంది అనేది వెండి తెర మీద చూడాల్సిందే.
నటీనటులు :
ప్రధాన నటులు నాగ చైతన్య, సమంతా ఇద్దరూ కూడా పోటీపడి నటించారు. అంతేకాకుండా నాగ చైతన్య, సమంతా మధ్య వచ్చే అన్ని ఎమోషనల్ సీన్స్ హైలైట్‌గా నిలుస్తాయి. కొత్త అమ్మాయి దివ్యాన్ష కౌశిక్ తన మొదటి సినిమా అయినా తన పాత్రకు న్యాయం చేసింది. ఇక మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిలో చక్కని నటన కనబరిచారు.
విశ్లేషణ :
‘నిన్ను కోరి’ సినిమా తర్వాత శివ నిర్వాణ నుంచి వస్తున్న చిత్రం ఇది. తన మొదటి సినిమా మాదిరిగానే ఈ సినిమా కథను కూడా చాలా ఎమోషనల్ గా రాసుకున్నాడు దర్శకుడు. ఇక అతని కథలోని పాత్రలకు ప్రాణం పోసే నటీనటులు దొరకడం తో ఈ సినిమాలో ఎమోషన్స్ చక్కగా పండాయి. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ మినహా మిగిలినవి ఏవి పెద్ద ఆకట్టుకోలేదు. ఇక సెకండ్ హాఫ్ లో ఎమోషన్స్ కొన్ని చోట్ల పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇవి తప్ప సినిమాలో చెప్పుకోదగ్గ మైనస్ పాయింట్స్ ఇంకేమి లేవు.
సాంకేతిక విభాగాల పనితీరు:
భార్యాభర్తలకు సంబంధించిన కథను మంచి ఎమోషనల్ సీన్స్ తో చక్కగా ప్రెజెంట్ చేశాడు దర్శకుడు శివ నిర్వాణ. విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. గోపి సుందర్ అందించిన సంగీతంలో రెండు పాటలు బాగున్నాయి. ఇక తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ డీసెంట్. ముఖ్యంగా నాగ చైతన్య, సమంతా మధ్య సన్నివేశాల్లో వచ్చే నేపధ్య సంగీతం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాగా షైన్ స్క్రీన్ క్రియేషన్స్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్ :
ప్రధాన పాత్రధారుల నటన
కొన్ని కామెడీ సీన్స్
మైనస్ పాయింట్స్ :
స్లో నెరేషన్