‘గేమ్ ఓవర్’ తెలుగు మూవీ రివ్యూ!

|

Jun 14, 2019 | 4:16 PM

టైటిల్ : ‘గేమ్ ఓవర్’ తారాగణం : తాప్సీ, వినోదిని, అనీష్ కురివిల్ల, సంజన నటరాజన్ తదితరులు సంగీతం : రోన్ ఏతాన్ యోహాన్ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : అశ్విన్ శరవణన్ విడుదల తేదీ: 14-06-2019 హీరోయిన్ తాప్సీ ప్రధాన పాత్రలో తమిళ దర్శకుడు అశ్విన్ శరవణన్ రూపొందించిన చిత్రం ‘గేమ్ ఓవర్’. వీడియో గేమ్స్ కాన్సెప్ట్‌ను నిజజీవితానికి ముడిపెడితే ఎలా ఉంటుందనేది ఈ సినిమా కథాంశం. పూర్తిగా సస్పెన్స్‌కు పెద్ద పీట వేస్తూ.. […]

గేమ్ ఓవర్ తెలుగు మూవీ రివ్యూ!
Follow us on

టైటిల్ : ‘గేమ్ ఓవర్’

తారాగణం : తాప్సీ, వినోదిని, అనీష్ కురివిల్ల, సంజన నటరాజన్ తదితరులు

సంగీతం : రోన్ ఏతాన్ యోహాన్

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : అశ్విన్ శరవణన్

విడుదల తేదీ: 14-06-2019

హీరోయిన్ తాప్సీ ప్రధాన పాత్రలో తమిళ దర్శకుడు అశ్విన్ శరవణన్ రూపొందించిన చిత్రం ‘గేమ్ ఓవర్’. వీడియో గేమ్స్ కాన్సెప్ట్‌ను నిజజీవితానికి ముడిపెడితే ఎలా ఉంటుందనేది ఈ సినిమా కథాంశం. పూర్తిగా సస్పెన్స్‌కు పెద్ద పీట వేస్తూ.. ఈ సినిమా హిందీ, తమిళ, తెలుగు భాషల్లో భారీ అంచనాల నడుమ ఇవాళ విడుదలైంది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించగలిగిందో ఇప్పుడు చూద్దాం.

కథ‌ : స్వప్న(తాప్సీ) ఓ వీడియో గేమ్ డిజైనర్. న్యూ‌ఇయర్ రాత్రి అనుకోని విధంగా తనపై జరిగిన అత్యాచారంతో.. ఆమె పూర్తిగా కృంగిపోయి.. వీల్ చైర్‌కు పరిమితం కావాల్సి వస్తుంది. పైగా నైట్ ఫోబియా అనే వ్యాధితో బాధపడుతూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా సిటీలో ఒంటరిగా ఉంటున్న అమృత(సంజన నటరాజన్) అనే అమ్మాయిని ఓ సైకో అత్యంత కిరాతకంగా చంపేస్తాడు. ఇలా వరుసగా ఒంటరిగా ఉంటున్న అమ్మాయిలను టార్గెట్ చేస్తూ సైకో హత్యలు చేస్తాడు.

మరోవైపు స్వప్న డిసెంబర్ 31న తన చేతిపై ఓ టాటూ వేయించుకుంటుంది. ఆ టాటూలో అమృత అస్తికలు కలుస్తాయి. ఇక అప్పటి నుంచి ఆమె జీవితంలో ఊహించని సంఘటనలు చోటు చేసుకుంటాయి. స్వప్న ఆ టాటూను తొలగించుకోవాలని అనుకున్నా వీలుపడదు. ఇంతకీ ఆ టాటూ వెనుక అసలు కథేంటి.? అమృతకు, స్వప్న టాటూకు మధ్య సంబంధమేంటి.? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

న‌టీన‌టులు :

సినిమా మొత్తం స్వప్న క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుంది. ఇక హీరోయిన్ తాప్సీ.. ఆ క్యారెక్టర్‌లో అద్భుతమైన పెర్ఫార్మన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. చీకటికి భయపడే మానసిక రోగి పాత్రలో ఏకంగా జీవించిందని చెప్పాలి. ఇక ఆమెకు సహాయకురాలిగా నటించిన వినోదిని కూడా నటన పరంగా మెప్పించింది. ఇంతకు మించి ఈ సినిమాలో చెప్పుకోదగ్గ పాత్రలు ఏమి లేవు.

విశ్లేష‌ణ‌ :

‘గేమ్ ఓవర్’ లాంటి సస్పెన్స్ ఓరియెంటెడ్ సినిమాకు.. సినిమాటోగ్రఫీ తోడైతే.. ఔట్‌పుట్ అద్భుతంగా ఉంటుంది. సరిగ్గా అలాంటి కాంబినేషన్ ఈ చిత్రానికి కుదరడంతో ప్రేక్షకులు మొదటి నుంచి చివరి వరకు కనురెప్పలార్పకుండా చూస్తారు. అయితే ఫస్ట్‌హాఫ్‌లో కొన్ని సాగతీత సన్నివేశాలు ఈ సినిమాకు మైనస్ పాయింట్లు అయ్యాయి.

సాంకేతిక విభాగాల పనితీరు:

దర్శకుడు అశ్విన్ శరవణన్ తాను అనుకున్న కథను స్క్రీన్‌పై బాగా చూపించాడు. ఇక దీనికి బ్యాగ్రౌండ్ స్కోర్ సరిగ్గా కుదరడంతో బాగా ఎలివేట్ అయింది. రోన్ ఏతాన్ అందించిన మ్యూజిక్ బాగుంది. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్లస్‌ పాయింట్స్‌ :

హీరోయిన్ తాప్సీ పెర్ఫార్మన్స్

కథ – స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ

మైనస్‌ పాయింట్స్‌ :

ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్