Nilakanta movie Review: నీలకంఠ మూవీ రివ్యూ.. ‘దేవి’ ఫేమ్ మాస్టర్ మహేంద్రన్ విలేజ్ డ్రామా ఎలా ఉందంటే..?

చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేసి.. దేవి లాంటి సినిమాలతో స్టార్ అయ్యాడు మాస్టర్ మహేంద్రన్. విజయ్ హీరోగా నటించిన మాస్టర్ సినిమాలో కూడా నటించాడు. ఈయన హీరోగా రాకేష్ మాధవన్ డైరెక్షన్‌లో వచ్చిన నీలకంఠ జనవరి 2న రిలీజ్ అయింది. రూరల్ పీరియడ్ స్టోరీగా వచ్చిన నీలకంఠ ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..

Nilakanta movie Review: నీలకంఠ మూవీ రివ్యూ.. దేవి ఫేమ్ మాస్టర్ మహేంద్రన్ విలేజ్ డ్రామా ఎలా ఉందంటే..?
Nilakanta Movie

Edited By:

Updated on: Jan 02, 2026 | 12:25 PM

మూవీ రివ్యూ: నీలకంఠ

నటీనటులు: మాస్టర్ మహేంద్రన్, నేహా పఠాన్, యాశ్న ముత్తులూరి, రాంకీ, బబ్లూ పృథ్వీ, కంచరపాలెం రాజు, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాష్, స్నేహ ఉల్లాల్ (స్పెషల్ సాంగ్) తదితరులు..

సంగీతం: మార్క్ ప్రశాంత్

ఎడిటింగ్: శ్రవణ్ జి కుమార్

దర్శకత్వం: రాకేష్ మాధవన్

 

కథ:

సరస్వతిపురం అనే ఊరు.. అక్కడ రాఘవయ్య (రాంకీ) మాటే శాసనం. ఆ ఊర్లో తప్పు చేస్తే విచిత్రమైన శిక్షలు ఉంటాయి. టెన్త్ క్లాస్ చదివే నీలకంఠ (మాస్టర్ మహేంద్రన్) చేసిన ఒక చిన్న తప్పుకి.. రాఘవయ్య ఒక షాకింగ్ శిక్ష వేస్తాడు. అదేంటంటే.. 15 ఏళ్ల పాటు ఊరు దాటకూడదు, పై చదువులు చదవకూడదు. ఊర్లోనే బందీగా మారిన నీలకంఠ.. తన లైఫ్‌ని కబడ్డీ గ్రౌండ్‌కి అంకితం చేస్తాడు. కట్ చేస్తే.. 15 ఏళ్ల తర్వాత చైల్డ్ హుడ్ ఫ్రెండ్ సీత (యశ్న) ఊరికి తిరిగొస్తుంది. అక్కడి నుంచి లవ్ ట్రాక్, ఊరి పాలిటిక్స్, నీలకంఠ సర్పంచ్ ఎలక్షన్‌కి వెళ్లడం.. ఇలా స్టోరీ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్తుంది. మిగిలింది స్క్రీన్ మీద చూడాల్సిందే..

కథనం:

రూరల్ పీరియడ్ డ్రామా సినిమాలు ఇప్పటి వరకూ చాలానే వచాయి. ఇప్పుడు నీలకంఠ కూడా ఇదే దారిలో వచ్చింది. సాధారణంగా ఊరు నుంచి గెంటేస్తే బయటికి వెళ్లాలి.. కానీ ఈ సినిమాలో ఊర్లోనే ఉంచి నరకం చూపించడం అనే కాన్సెప్ట్ కొంచెం కొత్తగా ఉంది. ఆడియన్స్ కు బోర్ కొట్టకుండా ఏదో మ్యాజిక్ చేయాలని చూసాడు దర్శకుడు రాకేష్ మాధవన్. ఇంటర్వెల్ తర్వాత.. కబడ్డీ మ్యాచ్‌లు, యాక్షన్ సీక్వెన్స్, పొలిటికల్ డ్రామాతో సినిమా బాగానే వెళ్తుంది. క్లైమాక్స్ ఓకే. పల్లెటూరి కథనే పీరియడ్ బ్యాక్ డ్రాప్ లో డిఫరెంట్ గా చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. చాలా ఏళ్ల తర్వాత స్నేహ ఉల్లాల్ ఒక స్పెషల్ సాంగ్‌లో మెరిసింది.

నటీనటులు:

మహేంద్రన్ తన యాక్టింగ్ మెచ్యూరిటీతో పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేశాడు. రాంకీ స్క్రీన్ ప్రెజెన్స్ పవర్‌ఫుల్. హీరోయిన్ యాశ్న చాలా నేచురల్ గా చేసింది. మరో హీరోయిన్ నేహా పఠాన్ కూడా బాగుంది. బబ్లూ పృథ్వీ, కంచరపాలెం రాజు, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాష్ వాళ్ళ క్యారెక్టర్స్ కు న్యాయం చేశారు.

టెక్నికల్ టీం:

మార్క్ ప్రశాంత్ ఇచ్చిన BGM బాగుంది. కెమెరా వర్క్ పర్లేదు.. విజువల్స్ రిచ్‌గా ఉన్నాయి. పల్లెటూరి అందాలను బానే క్యాప్చర్ చేశారు. నిర్మాణ విలువలు ఓకే. దర్శకుడు కమర్షియల్ ఎంట్రీ కోసం ట్రై చేశాడు.

ఓవరాల్ గా నీలకంఠ.. రూరల్ పీరియడ్ విలేజ్ డ్రామా..!