Devagudi Movie Review: దేవగుడి సినిమా రివ్యూ.. కులంపై సంధించిన బాణం.. రాయలసీమ నేపథ్యం కథ..!

ఈ మధ్య కాలంలో రా అండ్ రస్టిక్ సినిమాలకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా నిజజీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలకు ఆదరణ పెరుగుతోంది. ఇదే కోవలో రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన లేటెస్ట్ సినిమానే దేవగుడి. ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు రఘు కుంచె కీలక పాత్రలో నటించగా.. బెల్లం రామకృష్ణారెడ్డి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా ఎలా ఉంది..? ఆడియన్స్‌ని ఏ మేరకు మెప్పించింది..? అనేది ఈ రివ్యూలో చూద్దాం.

Devagudi Movie Review: దేవగుడి సినిమా రివ్యూ.. కులంపై సంధించిన బాణం.. రాయలసీమ నేపథ్యం కథ..!
Devagudi

Edited By:

Updated on: Jan 30, 2026 | 4:13 PM

మూవీ రివ్యూ: దేవగుడి

నటీనటులు: రఘు కుంచె, అభినవ్ శౌర్య, అనుశ్రీ, నరసింహ, రఘుబాబు, రాకెట్ రాఘవ తదితరులు..

సంగీతం: మదిన్

సినిమాటోగ్రఫర్: లక్ష్మీకాంత్ కనికే

ఎడిటర్: వి నాగిరెడ్డి

నిర్మాత, దర్శకత్వం: బెల్లం రామకృష్ణారెడ్డి

ఈ మధ్య కాలంలో రా అండ్ రస్టిక్ సినిమాలకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా నిజజీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలకు ఆదరణ పెరుగుతోంది. ఇదే కోవలో రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన లేటెస్ట్ సినిమానే దేవగుడి. ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు రఘు కుంచె కీలక పాత్రలో నటించగా.. బెల్లం రామకృష్ణారెడ్డి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా ఎలా ఉంది..? ఆడియన్స్‌ని ఏ మేరకు మెప్పించింది..? అనేది ఈ రివ్యూలో చూద్దాం.

కథ:

దేవగుడి గ్రామానికి చెందిన వీరారెడ్డి (రఘు కుంచె) అక్కడి ఫ్యాక్షన్ లీడర్. ఊరి జనాలందరినీ కడుపులో పెట్టుకుని చూసుకునే వీరారెడ్డికి.. కులాల విషయంలో మాత్రం విపరీతమైన పట్టింపు ఉంటుంది. తన కోసం ప్రాణాలిచ్చే అనుచరులను సైతం కులం పేరుతో దూరం పెడుతుంటాడు. వీరారెడ్డి ప్రధాన అనుచరుడి కొడుకైన ధర్మ (అభినవ్ శౌర్య), వీరారెడ్డి కొడుకు (నరసింహ) ప్రాణ స్నేహితులు. కానీ తక్కువ కులం వాడైన ధర్మ తన కొడుకుతో సమానంగా తిరగడాన్ని వీరారెడ్డి సహించలేడు. ఇలాంటి పరిస్థితుల్లో వీరారెడ్డి కూతురు శ్వేత (అనుశ్రీ).. ధర్మతో ప్రేమలో పడుతుంది. ఈ విషయం తెలిసిన వీరారెడ్డి.. ధర్మను చంపబోయి, చివరి నిమిషంలో ప్రాణాలతో వదిలేసి ఊరి నుంచి వెలేస్తాడు. ఆ తర్వాత అనూహ్యంగా వీరారెడ్డి అనారోగ్యం పాలవ్వడం, అదే అదనుగా చూసి ప్రత్యర్థులు దాడి చేయడం చకచకా జరిగిపోతాయి. ఈ గొడవల్లో హీరోయిన్ శ్వేత కనిపించకుండా పోతుంది. అసలు శ్వేత ఏమైంది..? ధర్మ మళ్ళీ ఊర్లోకి వచ్చాడా..? వీళ్ళ ప్రేమ కథ చివరికి ఏ తీరానికి చేరింది? అన్నదే మిగతా కథ.

కథనం:

నిజం చెప్పాలంటే ఇది కొత్త కథేమీ కాదు. కుల వ్యవస్థను ప్రశ్నిస్తూ గతంలో మనం చాలా సినిమాలు చూశాం. చిన్నప్పుడు స్నేహితులుగా మొదలై, పెరిగాక ప్రేమికులుగా మారడం.. పెద్దలు కులం పేరుతో అడ్డు చెప్పడం.. ఈ ఫార్మాట్ మనకు బాగా అలవాటైనదే. కథ వింటున్నంతసేపు గోపీచంద్ యజ్ఞం సినిమా వైబ్స్ కచ్చితంగా గుర్తొస్తాయి. అయితే దర్శకుడు ఎంచుకున్న దేవగుడి అనే రాయలసీమ విలేజ్ బ్యాక్‌డ్రాప్ సినిమాకు ప్లస్ అయ్యింది. మనిషి చంద్రమండలం వరకు వెళ్లినా.. ఇంకా కులాల కుంపటిలోనే మగ్గిపోతున్నాడనే పాయింట్‌ని దర్శకుడు స్ట్రాంగ్‌గా చెప్పే ప్రయత్నం చేశారు. ఈ మధ్య వచ్చిన దండోరా సినిమా కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించింది. కథ రొటీన్‌గానే ఉన్నా.. సినిమాను నడిపించిన విధానం బాగుంది. ఎక్కడా బోర్ కొట్టకుండా, మంచి కమర్షియల్ హంగులతో సినిమాను తెరకెక్కించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. అయితే స్క్రీన్‌ప్లే పరంగా తర్వాత ఏం జరుగుతుందనేది ఆడియన్స్ ఈజీగా గెస్ చేయగలుగుతారు. బడ్జెట్ పరిమితులు ఉన్నప్పటికీ.. రిచ్ విజువల్స్, సాంగ్స్, ఫైట్స్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా సినిమాను క్వాలిటీగా తీర్చిదిద్దారు.

నటీనటులు:

కొత్తవాళ్ళైన హీరో అభినవ్ శౌర్య, హీరోయిన్ అనుశ్రీ తమ పాత్రలకు న్యాయం చేశారు. స్క్రీన్ మీద చాలా ఈజ్‌తో నటించారు. ఇక కీలక పాత్రలో నటించిన రఘు కుంచె.. దేవగుడి వీరారెడ్డి పాత్రలో జీవించేశారని చెప్పాలి. ఆయన లుక్, యాక్టింగ్ సినిమాకు హైలైట్. రఘుబాబు, రాకెట్ రాఘవ, మీసాల లక్ష్మణ్ తమ కామెడీతో నవ్వించే ప్రయత్నం చేశారు.

టెక్నికల్ టీం:

మదిన్ అందించిన సంగీతం బాగుంది. పాటలు వినడానికి, చూడటానికి ప్లెజెంట్‌గా పర్లేదు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్‌ని బాగానే ఎలివేట్ చేసింది. ఎడిటింగ్ క్రిస్ప్‌గా ఉంది.. సినిమా నిడివి కూడా తక్కువే ఉండటం కలిసొచ్చే విషయం. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగానే ఉన్నాయి. పేస్ ఇంకాస్త ఉండుంటే మంచి సినిమా అయ్యుండేది. అయినా కూడా కులాన్ని గట్టిగానే ప్రశ్నించే సినిమాగా దేవగుడి వచ్చింది.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా దేవగుడి.. కథ పాతదే కానీ మంచి పాయింట్‌తో వచ్చిన సినిమానే..!