Mohan Babu Reaction : రాజకీయం ఒక రొచ్చు, ఒక బురద అది నీకు అంటకపోవడమే మంచిదైంది..

సూపర్ స్టార్ రజినీకాంత పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచతున్నారన్న వార్త తమిళ నట సంచలనం సృష్టించింది. కొంతమంది ఆయన రాజకీయాల్లోకి రావడాన్ని స్వాగతిస్తే..

Mohan Babu Reaction : రాజకీయం ఒక రొచ్చు, ఒక బురద అది నీకు అంటకపోవడమే మంచిదైంది..

Updated on: Dec 31, 2020 | 6:49 PM

Mohan Babu Reaction : సూపర్ స్టార్ రజినీకాంత పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచతున్నారన్న వార్త తమిళ నట సంచలనం సృష్టించింది. కొంతమంది ఆయన రాజకీయాల్లోకి రావడాన్ని స్వాగతిస్తే మరి కొంతమంది ఆయన రాజకీయాల్లోకి రాకపోవడమే మంచిదని కోరుకున్నారు. అయితే మరికొద్ది రోజుల్లో పార్టీ పేరు ప్రకటిస్తారనుకునే సమయంలో రజినీ అనారోగ్యానికి గురయ్యారు. హైదరాబాద్ లోని అపోలోలో ఆయన చికిత్స తీసుకున్నారు. వయసు రీత్యా, అనారోగ్య సమస్యల కారణంగా రాజకీయాలలోకి రావడం లేదని ప్రకటించారు సూపర్ స్టార్. రజినీ కాంత్ నిర్ణయం పై పలువురు స్పందించారు.అయితే రజినీకాంత్ నిర్ణయం పై భిన్నాభిప్రాయాలు కూడా వినిపించాయి. తాజాగా ఆయన స్నేహితుడు నటుడు మోహన్ బాబు స్పందించారు.

సూపర్ స్టార్ రాజకీయాలనుంచి తప్పుకోవడం పై మోహన్ బాబు ఓ లేఖను విడుదల చేశారు. రజినీకాంత్ నాకు అత్యంత ఆత్మీయుడు అన్న సంగతి మీ అందరికీ తెలుసు. తన ఆరోగ్య రీత్యా రాజకీయాల్లోకి రావడం లేదు అని ప్రకటించాడు. ఒకరకంగా తను రాజకీయాల్లోకి రాకపోవడం మీకు, అభిమానులందరికీ బాధ అయినప్పటికీ ఒక స్నేహితుడిగా తన ఆరోగ్యం గురించి పూర్తి అవగాహన ఉన్న ఒక వ్యక్తిగా రజినీ రాజకీయాల్లోకి రాకపోవడం మంచిది అని నమ్ముతున్నాను. నా మిత్రుడితో  ఎన్నో సందర్భాల్లో చెప్పాను. నువ్వు మంచివాడివి. చీమకు కూడా హాని చేయని వాడివి. నా దృష్టిలో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పర్సన్ నువ్వు .. నీ లాంటి వ్యక్తికి, నాలాంటి వ్యక్తికి రాజకీయాలు పనికిరావు. ఎందుకంటే డబ్బులు ఇచ్చి ఓట్లు, సీట్లు కొనలేం. రాజకీయాల్లోకి రానంత వరకు మంచి వాడివి అన్న వాళ్లే.. రేపు వచ్చిన తర్వాత చెడ్డవాడని అంటారు. రాజకీయం ఒక బురద. ఆ బురద అంటకుండా నువ్వు ఉండటమే మంచిదయ్యింది. రజనీకాంత్ అభిమానులు అందరూ రజనీకాంత్ అంత మంచి వాళ్లు. మీరందరూ సహృదయంతో నా మిత్రుడు తీసుకున్న నిర్ణయాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. అంటూ మోహన్ బాబు తన లేఖలో పేర్కొన్నారు .

ALSO READ :  Radheshyam Movie : ప్రభాస్ ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్ చెప్పిన రాధేశ్యామ్ డైరెక్టర్