
క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినీ రంగం ప్రయాణాన్ని స్టార్ట్ చేసి విలక్షణ నటుడిగా దాదాపు 500 సినిమాల్లో నటించారు సీనియర్ హీరో మంచు మోహన్ బాబు. ఇన్నేళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఆయన ఎన్నో విలక్షణమైన సినిమాలు చేశారు. ఇకపోతే మోహన్ బాబు తాజాగా ఓ తమిళ హీరో చిత్రంలో విలన్‌గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.
అసలు వివరాల్లోకి వెళ్తే.. తమిళ హీరో సూర్య ప్రధాన పాత్రలో లేడి డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్న ‘సూరరై పోట్రు’ సినిమాలో విలన్ రోల్ చాలా కీలకంగా ఉంటుందని సమాచారం. ఆ రోల్‌కు మోహన్ బాబు అయితేనే పూర్తి న్యాయం చేయగలరని చిత్ర యూనిట్ ఆయన్ని ఒప్పించారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.