వెబ్ సిరీస్‌తో రీ ఎంట్రీ ఇస్తున్న మిల్కీబ్యూటీ.. ఆహా ప్లాట్ ఫాం కేంద్రంగా విడుదల చేసేందుకు సన్నాహాలు..

| Edited By: Pardhasaradhi Peri

Dec 07, 2020 | 5:52 PM

టాలీవుడ్ టాప్ హీరోయిన్‌లలో ఒకరైన తమన్నాఇటీవల కరోనాకు గురైన విషయం తెలిసిందే. తమన్నా దాదాపుగా టాలీవుడ్ యంగ్ హీరోలందరితో నటించింది.

వెబ్ సిరీస్‌తో రీ ఎంట్రీ ఇస్తున్న మిల్కీబ్యూటీ.. ఆహా ప్లాట్ ఫాం కేంద్రంగా విడుదల చేసేందుకు సన్నాహాలు..
Follow us on

టాలీవుడ్ టాప్ హీరోయిన్‌లలో ఒకరైన తమన్నాఇటీవల కరోనాకు గురైన విషయం తెలిసిందే. తమన్నా దాదాపుగా టాలీవుడ్ యంగ్ హీరోలందరితో నటించింది. సూపర్ స్టార్ మహేశ్ బాబుతో దూకుడు, ఎన్టీఆర్‌తో ఊసరవెల్లి, ప్రభాస్‌తో బాహుబలి, రామ్‌చరణ్‌తో రచ్చ, అల్లు అర్జున్‌తో బద్రీనాథ్ సినిమాలు చేసింది. అంతేకాకుండా వెటరన్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవితో సైరా, వెంకటేశ్‌తో ఎఫ్ 2, నాగార్జునతో ఊపిరి సినిమాల్లో చేసి అందరి ఆదరాభిమానాలను సాధించుకుంది.

అయితే ఇటీవల తమన్నా లెవెన్త్ హ‌వ‌ర్ (11th Hour) వెబ్ సిరీస్‌లో నటిస్తుండగా కరోనాకు గురైంది. ప్రవీణ్ సత్తారు ఈ వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తుండగా అతిత్ హీరోగా నటిస్తున్నాడు. తమన్నా ఇటీవల కోలుకొని ఈ సిరీస్ షూటింగ్‌ను పూర్తిచేసినట్లు వార్తలు వినబడుతున్నాయి. అమెరికన్ సిరీస్ 24 ఆధారంగా ఈ వెబ్ సిరీస్ రూపొందుతుంది. ఓ రోజు రాత్రి జరిగిన సంఘటన ఆధారంగా సిరీస్ నడుస్తోంది. ఈ సిరీస్ అమెరికాలో చాలా పెద్ద హిట్ సాధించింది. అయితే ఈ వెబ్ సిరీస్‌లో తమన్నా కొన్ని న్యూడ్ సీన్‌లలో కూడా నటించిందని పుకార్లు షికారు చేస్తున్నాయి. తమన్నా ప్రస్తుతం నితిన్‌తో కలిసి ఓ సినిమాలో చేస్తుంది. అయితే లెవెన్త్ హ‌వ‌ర్ ట్రైలర్‌ను ఆహా ప్లాట్ ఫాం కేంద్రంగా విడుదల చేసేందుకు వెబ్ యూనిట్ సిద్దమవుతోంది.