మిహీక లెహంగా కోసం ఎన్ని గంటల సమయం పట్టిందంటే

| Edited By:

Aug 09, 2020 | 3:18 PM

మొత్తానికి దగ్గుబాటి వారసుడు రానా ఓ ఇంటివాడయ్యారు. శనివారం రాత్రి గం.8.45ని.ల సమయంలో తన ప్రేయసి మిహీక మెడలో మూడు ముళ్లు వేశారు రానా.

మిహీక లెహంగా కోసం ఎన్ని గంటల సమయం పట్టిందంటే
Follow us on

Rana weds Miheeka: మొత్తానికి దగ్గుబాటి వారసుడు రానా ఓ ఇంటివాడయ్యారు. శనివారం రాత్రి గం.8.45ని.ల సమయంలో తన ప్రేయసి మిహీక మెడలో మూడు ముళ్లు వేశారు రానా. కరోనా నేపథ్యంలో ఈ శుభకార్యానికి ఇరు కుటుంబాల అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు అయ్యారు. ఇండస్ట్రీ నుంచి రామ్ చరణ్, అల్లు అర్జున్‌లు ఈ వివాహంలో పాల్గొన్నారు.. మిగిలిన వారు వీఆర్ కిట్స్ ద్వారా పెళ్లిని ప్రత్యక్షంగా వీక్షించారు. ఇక వీరి వివాహానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇదిలా ఉంటే వివాహంలో డిజైనర్ లెహంగాతో మిహీక మెరిసిపోయారు. కాగా వేల గంటల పాటు వెచ్చించి ఈ లెహంగాను తయారు చేశారట. ఈ విషయాన్ని డిజైనర్‌ అనామిక ఖన్నా వెల్లడించారు. క్రీమ్‌, గోల్డ్ కలర్‌లో ఉన్న ఈ లెహంగానూ పగడపు వీల్‌తో తాము తయారుచేసినట్లు ఆమె తెలిపారు. అంతేకాదు హ్యాండ్ ఎంబ్రాయిడీతోనే దీన్ని కుట్టినట్లు అనామిక వివరించారు. దీని ధర రూ.6లక్షలు ఉండొచ్చని సమాచారం.

Read This Story Also: బన్నీ ఔట్.. చెర్రీ ఇన్‌!