Breaking News
  • ఇన్సూరెన్స్ మెడికల్ స్కామ్ కేసులో దేవికారాని కి బెయిల్ మంజూరు ఏసీబీ కోర్ట్. దేవికారాని తో పాటు జాయింట్ డైరెక్టర్ పద్మ, ఫార్మసీస్ట్ వసంత, మరో ఇద్దరు ఫార్మా ఉద్యోగుల కు బెయిల్ ఇచ్చిన ఏసీబీ కోర్ట్.
  • అమరావతి: పుట్టా సుధాకర్ యాదవ్ ,టీటీడీ మాజీ ఛైర్మన్. డిక్లరేషన్ నిబంధనను రాజులు, బ్రిటీషు వారు కూడా గౌరవించారు. అటువంటి నిబంధన అవసరం లేదనే అధికారం టీటీడీ ఛైర్మన్ కు ఎవరిచ్చారు? ఛైర్మన్ ఇష్టానుసారం మాట్లాడుతుంటే, మిగిలిన బోర్డు సభ్యులు ఎందుకు మాట్లాడటం లేదు? గతంలో తిరుమల విషయంలో అయినదానికీ, కానిదానికీ గగ్గోలు పెట్టిన స్వామీజీలు, పీఠాధిపతులు జగన్ చర్యలపై, సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై ఎందుకు స్పందిండం లేదు? డిక్లరేషన్ లో సంతకం ఎందుకని ప్రశ్నించేవారు, అసలు స్వామివారిని దర్శించుకోకపోతే మాత్రం ఏమైంది?
  • ఘాటెక్కిన ఉల్లి. మలక్ పెట్ మార్కెట్ లో కింటా ఉల్లి ధర 5 వేలు. , కర్ణాటక, ఆంధ్రా తెలంగాణ ల్లో కురుస్తున్న వర్షాలవల్ల భారీగా దెబ్బతిన్న ఉల్లి పంట. స్టాక్ ఉన్న మహారాష్ట్ర ఉల్లికి డిమాండ్. వార్శాలు ఆగక పోతే మరింత పెరిగే అవకాశం.
  • తిరుమల: తిరుమల ఆలయ సమీపంలో రాత్రివేళ గుంపులుగా తిరుగుతున్న చిరుతలు. వీధుల్లో తిరుగుతున్న ఎలుగుబంట్లు. యానిమాల్ డిటెక్టర్ కెమెరాల ద్వారా గుర్తిస్తున్న విజిలెన్స్ . జంతువు కెమెరాలో కనపడగానే అలారం మోగేలా ఏర్పాటు చేసిన టిటిడి విజిలెన్స్ అధికారులు. బ్రహ్మోత్సవాల వేళ అడవి జంతువుల నుంచి భక్తులకు ఏలాంటి ఇబ్బంది లేకుండా కెమెరా సైరన్ ద్వారా జంతువులను బెదరగొడుతున్న సిబ్బంది. గత మూడునెలలుగా అనేకసార్లు అలయపరిసరాల్లోకి వచ్చిన చిరుతలు, ఎలుగుబంట్లు.
  • అమరావతి: రాజధాని తరలింపుపై హైకోర్టు జారీ చేసిన స్టేటస్ కో ఆదేశాలు అక్టోబర్ 5 వరకు కొనసాగింపు. సుంకర రాజేంద్రప్రసాద్, ఏపీ హైకోర్టు న్యాయవాది. విశాఖ గెస్ట్ హౌస్ నిర్మాణం కోర్టు ధిక్కరణగా పిటిషన్. దీనిపై కౌంటర్ దాఖలుకు వారం సమయం కోరిన ప్రభుత్వం. అంశాల వారీగా పిటిషన్లు విచారించాలని నిర్ణయం. కేంద్రం అన్ని రిట్లకు సమాధానం ఇవ్వాలని కోరాం. కొన్నింటికి మాత్రమే సమాధానాలు ఇచ్చారు. కేంద్రం తరపు న్యాయవాదులు అన్నిటికీ సమాధానం వేయాలంటే వేస్తామన్నారు. ఢిల్లీ న్యాయవాదులు హై బ్రిడ్ సిస్టం ద్వారా విచారణ చేయాలని కోరారు.
  • తెలంగాణ తెలుగుదేశం పార్టీలో తిరుగుబాటు. ప్రస్తుత అధ్యక్షుడిని మార్చాలంటూ సీనియర్లు బాబు కు లేఖ. తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకత్వం‌ మార్పు జరగాలని చంద్రబాబును కోరిన పార్టీ నేతలు. తెలంగాణ లో పరిస్థితి పై చంద్రబాబుకు వివరించిన సీనియర్లు , కార్యకర్తలు. ఏడూ ఏళ్లుగా ఓకే అధ్యక్షునీతో పార్టీ పరిస్థితి ఆందోళనలో పడిందని తెలిపిన పార్టీ నేతలు. కింది స్థాయి కార్యకర్త నుండి పార్లమెంటు ఇంచార్జి , కోర్ కమిటీ వరకు నాయకత్వ మార్పు కోరుతూ బాబుకు డిమాండ్.
  • మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కేసులో సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఏపీ ప్రభుత్వం . ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టే ఎత్తివేయాలని పిటిషన్ లో వినతి. దర్యాప్తును నిలిపివేస్తూ కొద్ది రోజుల క్రితం తీర్పునిచ్చిన హైకోర్టు. కేసు దర్యాప్తుపై స్టే విధించడం వల్ల కీలకమైన ఆధారాలను నిందితులు నాశనం చేసే అవకాశం ఉందని పిటిషన్లో వాదన.

బన్నీ ఔట్.. చెర్రీ ఇన్‌!

ఎంసీఏ ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఐకాన్ అనే చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. గతేడాది ప్రారంభంలో ఈ సినిమా ప్రీ లుక్‌ కూడా విడుదల అయ్యింది.
Ram Charan in Icon, బన్నీ ఔట్.. చెర్రీ ఇన్‌!

Ram Charan in Icon: ఎంసీఏ ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఐకాన్ అనే చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. గతేడాది ప్రారంభంలో ఈ సినిమా ప్రీ లుక్‌ కూడా విడుదల అయ్యింది. అయితే ఈ తరువాత ఈ మూవీకి సంబంధించి ఇటు దర్శకుడు గానీ, అటు హీరో గానీ ఒక్క ప్రకటన కూడా చేయలేదు. ఇదిలా ఉంటే అందరికీ సర్‌ప్రైజ్‌ ఇస్తూ ఇటీవల తన 21వ సినిమాను కొరటాలతో కన్ఫర్మ్ చేశారు బన్నీ. ఈ నేపథ్యంలో ఐకాన్ ఆగిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక ఇదే సమయంలో ఈ మూవీ కోసం నిర్మాత దిల్‌ రాజు, రామ్ చరణ్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అన్నీ అనుకున్నట్లు జరిగితే ఐకాన్‌లో చెర్రీ నటించనున్నారు. కాగా ప్రస్తుతం రామ్ చరణ్, రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్‌ఆర్‌లో నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌తో తొలిసారిగా కలిసి నటిస్తున్నారు చెర్రీ. అలాగే చిరు ప్రధానపాత్రలో కొరటాల తెరకెక్కిస్తోన్న ఆచార్యలో కీలక పాత్రలో కనిపించనున్నారు. వీటి తరువాత ఇంకా చెర్రీ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించలేదు.

Read This Story Also: స్వర్ణ ప్యాలెస్ ఘటనపై కేసు నమోదు

 

Related Tags