Indian 2 Accident: అది నా మీద పడినా బావుండేదేమో: శంకర్ ఎమోషనల్ పోస్ట్

| Edited By:

Feb 26, 2020 | 5:48 PM

గత వారం ఇండియన్ 2 మూవీ షూటింగ్‌లో జరిగిన క్రేన్ ప్రమాదం కోలీవుడ్‌తో పాటు దక్షిణాది ఇండస్ట్రీని ఉలిక్కిపడేలా చేసింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మరణించగా.. పది మందికి పైగా గాయపడ్డారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును కూడా చేపడుతున్నారు.

Indian 2 Accident: అది నా మీద పడినా బావుండేదేమో: శంకర్ ఎమోషనల్ పోస్ట్
Follow us on

Indian 2 Accident: గత వారం ఇండియన్ 2 మూవీ షూటింగ్‌లో జరిగిన క్రేన్ ప్రమాదం కోలీవుడ్‌తో పాటు దక్షిణాది ఇండస్ట్రీని ఉలిక్కిపడేలా చేసింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మరణించగా.. పది మందికి పైగా గాయపడ్డారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్శకుడు, నిర్మాత, హీరోలకు నోటీసులు కూడా జారీ చేశారు. మరోవైపు ఈ కేసును తమిళనాడు ప్రభుత్వం సీఐడీని అప్పగించింది. ఇక ఈ దుర్ఘటనపై పలువురు స్పందించి తమ సానుభూతిని కూడా ప్రకటించారు. అయితే ప్రమాదం జరిగినప్పటి నుంచి దర్శకుడు శంకర్ దీనిపై స్పందించలేదు. దీంతో శంకర్ ఎక్కడున్నారు..? ఈ ప్రమాదంలో శంకర్‌ కూడా గాయపడ్డారు..? ఆయన ఎందుకు ఈ ఘటనపై స్పందించలేదు..? అన్న ప్రశ్నలు అందరిలో మెదిలాయి. ఆ ప్రశ్నలన్నింటికి తాజాగా సమాధానం చెప్పేశారు శంకర్.

సోషల్ మీడియాలో ఓ ట్వీట్ వేసిన శంకర్.. ‘‘చాలా బాధతప్తమైన హృదయంతో ఈ ట్వీట్‌ను చేస్తున్నా. ఈ ప్రమాదం జరిగినప్పటి నుంచి నేను షాక్‌లో ఉండిపోయా. నా అసిస్టెంట్ డైరక్టర్, మూవీ యూనిట్ మరణంతో నిద్రలేని రాత్రులు గడిపా. ఈ ప్రమాదం నుంచి వెంట్రుక వాసిలో తప్పించుకున్నా. ఆ క్రేన్ నా మీద పడినా బావుండేదేమో. బాధితుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా’’ అని అన్నారు. కాగా ఆ ప్రదేశం నుంచి కొన్ని నిమిషాల ముందే వెళ్లిపోయిన కమల్ హాసన్, కాజల్ అగర్వాల్.. ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆ తరువాత మృతుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.కోటి రూపాయల నష్టపరిహారం అందించేందుకు కమల్ ముందుకొచ్చిన విషయం తెలిసిందే.

Read This Story Also: ‘ఇండియన్ 2’ ప్రమాదం.. కమల్, శంకర్‌లకు సమన్లు..!