
‘ఎఫ్ 2’తో సూపర్ హిట్ కొట్టిన యంగ్ హీరోయిన్ మెహ్రీన్ కౌర్ వరుస ఆఫర్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఇటీవల గోపీచంద్ హీరోగా దర్శకుడు తిరు తెరకెక్కించే సినిమా లో ఛాన్స్ దక్కించుకున్న ఈ బ్యూటీ లేటెస్ట్ గా మరో ఆఫర్ ను పట్టేసిందని సమాచారం.
యంగ్ హీరో నాగ శౌర్య ఓ నూతన దర్శకుడు తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో మెహ్రీన్ ను హీరోయిన్ గా ఎంపిక చేశారట. ఐరా క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఇది ఇలా ఉండగా శౌర్య ప్రస్తుతం శ్రీనివాస్ అవసరాల డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే శౌర్య తన తదుపరి చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు.