Bheemla Nayak: భీమ్లా నాయక్‌ ట్రైలర్‌పై రామ్‌ చరణ్‌ ఏమన్నారో తెలుసా.? మెగా రివ్వ్యూ..

Bheemla Nayak: పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ కొత్త సినిమా భీమ్లా నాయక్‌ చిత్రం కోసం ఆయన అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ డైలాగ్‌లు అందిస్తుండడం, రానా, పవన్‌ కళ్యాణ్‌ కలిసి నటిస్తుండడంతో ఈ సినిమాపై...

Bheemla Nayak: భీమ్లా నాయక్‌ ట్రైలర్‌పై రామ్‌ చరణ్‌ ఏమన్నారో తెలుసా.? మెగా రివ్వ్యూ..
Bheemla Nayak Trailer

Updated on: Feb 23, 2022 | 1:38 PM

Bheemla Nayak: పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ కొత్త సినిమా భీమ్లా నాయక్‌ చిత్రం కోసం ఆయన అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ డైలాగ్‌లు అందిస్తుండడం, రానా, పవన్‌ కళ్యాణ్‌ కలిసి నటిస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తగ్గట్లుగానే దర్శకుడు పవన్‌ రేంజ్‌ను ఎలివేట్ చేస్తూ సినిమాను తెరకెక్కించారు. ఇక భీమ్లా నాయక్‌ సినిమా ఈ నెల 25న విడుదలవుతోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఫిబ్రవరి 21న సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం భీమ్లా నాయక్‌ ట్రైలర్‌ మేనియా కొనసాగుతోంది. పవర్‌ ఫుల్‌ ప్యాక్‌డ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ట్రైలర్‌ కూడా అదే రేంజ్‌లో ఉంది. ముఖ్యంగా పవన్‌, రానాల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఫిదా చేస్తున్నాయి.

అభిమానుల నుంచి సినీ సెలబ్రిటీల వరకు భీమ్లా నాయక్‌ ట్రైలర్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ కూడా వచ్చి చేశారు. తన బాబాయ్‌ పవన్‌ కళ్యాన్‌ సినిమా ట్రైలర్‌పై ట్విట్టర్‌ వేదికగా ప్రశంసల వర్షం కురిపించారు. భీమ్లా నాయక్‌ చిత్ర యూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పిన చరణ్‌.. ‘భీమ్లా నాయక్‌ ట్రైలర్‌ ఎలక్ట్రిఫైయింగ్‌ ఉంది. ట్రైలర్‌లోని ప్రతీ డైలాగ్‌, పవన్‌ కళ్యాణ్‌ గారి యాక్షన్‌ పవర్‌ ఫుల్‌గా ఉంది. ఇక నా స్నేహితుడు రానా దగ్గుబాటి నటన సూపర్‌గా ఉంది. చిత్ర యూనిట్‌ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌’ అంటూ ట్వీట్‌ చేశారు.

ఇదిలా ఉంటే భీమ్లా నాయక్‌ చిత్రాన్ని మలయాళంలో భారీ విజయాన్ని అందుకున్న ‘అయ్యప్పనుమ్‌ కోషియమ్‌’ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు సాగర్‌ కే చంద్ర దర్శకత్వం వహిచంగా, థమన్‌ సంగీతం అందించారు. ఇక ఇందులో పవన్‌కు జోడిగా నిత్యా మీనన్‌, రానా సరసన సంయుక్త మీనన్‌ నటిస్తోంది. భీమ్లానాయక్‌ ప్రీరిలీజ్‌ ఈవెంట్ నేడు (బుధవారం) సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానుంది.

Also Read: అదృష్టం ఇదే గురూ.. మట్టి పని చేస్తుండగా తలరాతే మారింది.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు..

SBI Alert: ఎస్‌బీఐ కస్టమర్లకు అలెర్ట్.. ఆ గడువు మార్చి 31 వరకే.. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి

Zodiac Signs: ఈ 4 రాశులవారు పక్కా స్వార్ధపరులు.. వీరిని అస్సలు నమ్మొద్దు!