చిరు నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌లివే.. దర్శకుల లిస్ట్ చెప్పేసిన మెగాస్టార్‌..!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య'లో నటిస్తున్నారు. ఈ మూవీ తరువాత 'లూసిఫర్' రీమేక్‌లో ఆయన నటించనున్నారు.

చిరు నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌లివే.. దర్శకుల లిస్ట్ చెప్పేసిన మెగాస్టార్‌..!

Edited By:

Updated on: Apr 20, 2020 | 2:52 PM

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’లో నటిస్తున్నారు. ఈ మూవీ తరువాత ‘లూసిఫర్’ రీమేక్‌లో ఆయన నటించనున్నారు. ఈ రీమేక్‌కు సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ రెండు సినిమాల తరువాత తాను ఎవరెవరి దర్శకత్వంలో నటించబోతున్నానో ఓ క్లారిటీని ఇచ్చేశారు చిరంజీవి. ఈ మేరకు ఇవాళ టీవీ 9కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. తన తదుపరి సినిమాల గురించి చిరు పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

తనకు బాబీ, మెహర్ రమేష్ కథలు చెప్పారని.. అలాగే సుకుమార్, హరీష్ శంకర్, పరశురామ్ కూడా తనతో పనిచేసే ఆలోచనలో ఉన్నారని చిరంజీవి తెలిపారు. ఇక ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతి ప్రపంచమంతా విస్తరించిందని.. దీన్ని చూస్తుంటే చాలా ముచ్చటేస్తుందని ఆయన అన్నారు. ఇక రాజమౌళి వల్లే ఈ ఖ్యాతి తెలుగు పరిశ్రమకు వచ్చిందని చిరు కితాబిచ్చారు. మొత్తానికి ఈ లిస్ట్ చూస్తుంటే వచ్చే ఐదారు సంవత్సరాలు.. చిరు వరుస సినిమాలతో బిజీగా ఉండనున్నట్లు అర్థమవుతోంది.

Read This Story Also: ‘పుష్ప’లో సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతోన్న బన్నీ..!