‘పుష్ప’లో సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతోన్న బన్నీ..!

అల్లు అర్జున్, సుకుమార్ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కబోతోన్న మూడో చిత్రం 'పుష్ప'. ఎర్రచందనం నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ ఇటీవల విడుదల అవ్వగా..

'పుష్ప'లో సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతోన్న బన్నీ..!
Follow us

| Edited By:

Updated on: Apr 20, 2020 | 2:16 PM

అల్లు అర్జున్, సుకుమార్ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కబోతోన్న మూడో చిత్రం ‘పుష్ప’. ఎర్రచందనం నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ ఇటీవల విడుదల అవ్వగా.. సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో సుకుమార్ కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా పాన్‌ ఇండియా మూవీగా పుష్పను విడుదల చేయబోతుండగా.. స్క్రిప్ట్‌పై చాలా కసరత్తు చేశారట సుకుమార్.

కాగా ఈ మూవీలో అల్లు అర్జున్ చిత్తూరు జిల్లాకు చెందిన లారీ డ్రైవర్ పాత్రలో కనిపించబోతున్నాడని ఎప్పటినుంచో వార్తలు వచ్చాయి. దానికి తోడు ఫస్ట్‌లుక్‌లో రఫ్‌ లుక్‌లో అదరగొట్టేశారు బన్నీ. ఇదిలా ఉంటే ఈ మూవీలో బన్నీ మరో సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నారట. ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్స్‌లో బన్నీ డాన్‌గా కనిపించనున్నారట. ఈ పాత్ర చాలా స్టైలిష్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే.. మొదటిసారిగా డాన్ పాత్రలో కనిపించనున్నారు బన్నీ. ఇక మొదట రఫ్ లుక్‌పై ఆ తరువాత స్టైలిష్‌ లుక్‌పై సుకుమార్ చిత్రీకరణ చేయబోతున్నట్లు టాక్. కాగా ఈ మూవీలో రష్మిక హీరోయిన్‌గా కనిపిస్తుండగా.. బన్నీ, రష్మిక మధ్య రొమాన్స్ ఉండబోదని వార్తలు వినిపిస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్‌, ముత్తంశెట్టి క్రియేషన్స్ నిర్మిస్తోన్న ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటున్నారు.

Read This Story Also: ’20 సంవత్సరాల బద్రీ’.. ఆ రోజుల్లో అంటూ.. రేణు ఙ్ఞాపకాలు