మురళీమోహన్‌కు మెగాస్టార్ పరామర్శ

సీనియర్ నటుడు, మాజీ ఎంపీ మురళీమోహన్‌ను మెగాస్టార్ చిరంజీవి దంపతులు కలిశారు. కొన్ని రోజుల క్రితం వెన్నెముకకు శస్త్ర చికిత్స చేయించుకున్న మురళీమోహన్.. ప్రస్తుతం హైదరాబాద్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. మురళీ మోహన్ త్వరగా కోలుకోవాలని ఈ సందర్భంగా చిరు ఆకాంక్షించారు. కాగా చిరంజీవి ప్రస్తుతం ప్రతిష్టాత్మక సైరా మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా దర్శకనిర్మాతలు […]

మురళీమోహన్‌కు మెగాస్టార్ పరామర్శ

Edited By:

Updated on: Jun 01, 2019 | 12:59 PM

సీనియర్ నటుడు, మాజీ ఎంపీ మురళీమోహన్‌ను మెగాస్టార్ చిరంజీవి దంపతులు కలిశారు. కొన్ని రోజుల క్రితం వెన్నెముకకు శస్త్ర చికిత్స చేయించుకున్న మురళీమోహన్.. ప్రస్తుతం హైదరాబాద్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. మురళీ మోహన్ త్వరగా కోలుకోవాలని ఈ సందర్భంగా చిరు ఆకాంక్షించారు. కాగా చిరంజీవి ప్రస్తుతం ప్రతిష్టాత్మక సైరా మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.