మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) కొన్ని రోజుల క్రితం కరోనా (Covid 19) బారిన పడిన సంగతి తెలిసిందే. స్వల్ప లక్షణాలతో బాధపడుతోన్న ఆయన కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా.. కొవిడ్ పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని చిరంజీవి.. తన సోషల్ మీడియా (Social Media) ఖాతా ద్వారా తెలియజేశారు. ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తాను కరోనా బారిన పడక తప్పలేదంటూ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆయన క్యారంటైన్లో ఉంటూ వైద్యుల సూచనలతో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఏటా తన తల్లి పుట్టినరోజు వేడుకలను దగ్గరుండి ఘనంగా జరిపించే మెగాస్టార్ ఈసారి మాత్రం కరోనా కారణంగా తన తల్లిని కలుసుకోలేకపోయారు. కాగా క్వారంటైన్ లో ఉన్న చిరంజీవి తాజాగా తన ఫొటోగ్రఫీ నైపుణ్యానికి పదును పెట్టారు. ఇందులో భాగంగా అప్పుడప్పుడే ఉదయించబోతున్న సూర్యుడిని తన కెమెరాలో బంధించాడు. అంతేకాదు దానిని సోషల్ మీడియాలో పంచుకుంటూ ఓ అద్భుతమైన కవిత కూడా అల్లారు.
‘ఈ రోజు ఉదయం లేవగానే కనిపించిన అందమైన ఆకాశాన్ని కెమెరాలో బంధించి మీతో పంచుకోవాలనిపించింది. ఒక మూలగా వున్న నెలవంక, దగ్గర్లో వున్నశుక్ర గ్రహం(మధ్యలో చిన్న తార) ఉదయించబోతున్న సూర్యుడు. ఆ కొంటె సూర్యుడ్ని చూడలేక నెలవంక సిగ్గుతో పక్కకు తొలిగినట్లుగా ఉంది’ అంటూ తను షూట్ చేసిన వీడియోను ఇన్ స్టాలో షేర్ చేశారు చిరు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు అభిమానులు ‘ సూపర్ సార్.. అద్భుతంగా క్యాప్చర్ చేశారు’, ‘ మీరు త్వరగా కోలుకోవాలి’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా చిరంజీవి నటించిన ‘ఆచార్య’ ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దీనితో పాటు ఆయన ప్రస్తుతం ‘భోళా శంకర్’, ‘లూసిఫర్’ రీమేక్ ‘గాడ్ ఫాదర్’ (వర్కింగ్ టైటిల్), కే.ఎస్, రవీంద్ర, వెంకీ కుడుముల తెరకెక్కిస్తోన్న చిత్రాల్లోనూ నటిస్తున్నారు.
Also read:PUC Certificate: పెట్రోల్, డీజిల్ కావాలంటే ఆ సర్టిఫికేట్ చూపించాల్సిందే..!
Gold, Silver Price Today: బంగారం, వెండి కొనుగోలుదారులకు శుభవార్త.. దిగి వస్తున్న ధరలు..!
Job Recruitment: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆ సంస్థలో 1196 అప్రెంటిస్ ఉద్యోగాలు..!