Master movie: లాక్‌డౌన్ అనంతరం తమిళంలో విడుదలైన తొలి సినిమా మాస్టర్. దళపతి విజయ్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఎక్స్‌బీ ఫిల్మ్ క్రియేటర్స్ బ్యానర్‌పై గ్జేవియర్ బ్రిట్టో నిర్మించారు. కాగా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ళ వర్షం కురిపిస్తుంది. గత రెండు వారాలలో రూ.97 కోట్ల వసూళ్ళు రాబట్టగా, తమిళనాడులో అత్యధిక వసూళ్ళు రాబట్టిన ఏడో చిత్రంగా నిలిచింది.
ఈ సినిమాలో విజయ్ సేతుపతి విలన్‌గా నటించారు. గతేడాది ఏప్రిల్‌లో విడుదల కావాల్సినఈ చిత్రం లాక్‌డౌన్ కారణంగా జనవరి 13న విడుదలైంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైంది.50 శాతం ఆక్యుపెన్సీతోనే ఈ చిత్రం ఇంతలా వసూళ్ళు రాబడుతుంటే, వందశాతం ఆక్యుపెన్సీ అనుమతి ఇచ్చి ఉంటే తమిళనాడులో అత్యధిక వసూళ్లు కలెక్ట్ చేసిన తొలి చిత్రంగా రికార్డులు నమోదు చేయడంతో పాటు బాహుబలి ది కన్‌క్లూజన్ రికార్డులు కూడా బ్రేక్ చేసి ఉండేదేమో అని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సినిమాలో మాళవికా మోహనన్, ఆండ్రియా, శాంతను భాగ్యరాజ్, అర్జున్ దాస్ ముఖ్య పాత్రలు పోషించారు.
రికార్డులు తిరగరాస్తోన్న ‘మాస్టర్’ టీజర్… దళపతి, విజయ్ సేతుపతిల క్రేజ్‌కు ఇదే నిదర్శనం..