Tollywood: శక్తిలో ఎన్టీఆర్‌తో కలిసి నటించిన ఈ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?

టాలీవుడ్‌లో ఒకప్పుడు అవకాశాలు దక్కించుకున్న మంజరి ఫెడ్నస్.. స్టార్ హీరో ఎన్టీఆర్ సరసన నటించే వరకు ఎదిగింది. కానీ శక్తి సినిమా ఫ్లాప్‌తో ఆమె కెరీర్ మలుపు తిరిగింది. హీరోయిన్‌గా నిలబడలేకపోయినా, ప్రస్తుతం హిందీ వెబ్‌సిరీస్‌లు, చిన్న సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొనసాగుతోంది.

Tollywood: శక్తిలో ఎన్టీఆర్‌తో కలిసి నటించిన ఈ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?
Manjari Fadnis

Updated on: Aug 29, 2025 | 7:45 AM

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా నిలబడటం అంత సులభం కాదు. అందం, టాలెంట్ ఉంటే చాలు అనుకునే రోజులు పోయాయి. అదృష్టం కూడా తోడైతేనే హీరోయిన్ కెరీర్ బలపడుతుంది. లేకపోతే స్టార్ హీరో సరసన నటించే అవకాశం వచ్చినా.. సినిమా ఫ్లాప్ అయితే ఆ ప్రయాణం అక్కడికే ఆగిపోతుంది. ఆ కోవలోకే వస్తుంది మంజరి ఫెడ్నస్. గుర్తుందా ఈ హీరోయిన్? అల్లరి నరేష్ హీరోగా వచ్చిన సిద్దూ ఫ్రం శ్రీకాకుళం, శుభప్రదం మూవీస్‌లో నటించి మంచి ఇంప్రెషన్ తెచ్చుకుంది. అందం, నటన రెండింటితోనూ ఆకట్టుకుంది. అదే బాటలో జూనియర్ ఎన్టీఆర్ సరసన కూడా అవకాశం వచ్చింది.

మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన భారీ బడ్జెట్ మూవీ శక్తిలో హీరోయిన్‌గా నటించింది. రుద్ర పాత్ర పక్కన మెప్పించినా, సినిమా ప్లాప్ అవ్వడంతో ఆ ఛాన్స్ వృథా అయింది. ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాకపోవడంతో సినిమాలకు గుడ్‌బై చెప్పాల్సి వచ్చింది. ప్రస్తుతం మంజరి బాలీవుడ్ వెబ్‌సిరీస్‌లు, అక్కడి చిన్న సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొనసాగుతోంది. అంటే హీరోయిన్‌గా వెలుగులు విరజిమ్మలేకపోయినా, నటిగా తన ప్రయాణం మాత్రం ఆగలేదు. ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టీవ్. ఇక తన రీసెంట్ ఫోటోలు చూసిన నెటిజన్స్ అమ్మడి అందం ఇంకా చెక్కు చెదరలేదు అని కామెంట్స్ పెడుతున్నారు. మీకు కూడా ఆ ఫోటోస్‌పై ఓ లుక్కేయండి…