Malvi Malhotra: బుల్లితెర నటి మాల్వీ మల్హోత్ర తన లైఫ్‌లో జరిగిన ఇన్సిడెంట్ నుంచి ఇంకా కోలుకోలేకపోతుంది. ఫేస్‌బుక్ ద్వారా మాల్వీకి పరిచయం యోగేష్ మహిపాల్ సింగ్ అనే వ్యక్తి మాల్వీపై కత్తితో దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. హత్యాయత్నానికి ప్రయత్నించిన యోగేష్‌ను పోలీసులు అరెస్ట్ చేసి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇటీవల బెయిల్ కూడా నిరాకరించారు.
యోగేష్ మహిపాల్ సింగ్ అనే వ్యక్తి పెళ్లి చేసుకోవాలని కోరగా మాల్వీ నిరాకరించడంతో ఆమెపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు శారీరకంగా, మానసికంగా కోలుకోలేకపోతుంది మాల్వీ. కాగా మల్హోత్ర రీసెంట్‌గా ఫిల్మ్ మేకర్ మధుర్ భండార్కర్‌ను కలిసింది. ఈ నేపథ్యంలో మధుర్ భండార్కర్ అండ్ టీమ్ తనకు మోరల్ సపోర్ట్ ఇస్తూ ‘బ్రేవ్ మాల్వీ.. స్టే స్ట్రాంగ్’ అంటూ కేక్ కట్ చేయించారని తెలిపింది. త్వరలో ఆయన సినిమాలో కూడా నటించే అవకాశం ఉందన్న మల్హోత్ర.. కానీ డాక్టర్స్ మరో రెండు నెలల పాటు ఔట్ డోర్ వెళ్లకూడదని సూచించారని చెప్పింది. ఎంతైనా మాల్వీ బ్రేవ్ గర్ల్ అని అందరు కొనియాడుతున్నారు.
అభిమానులకు దొరికిపోయిన బాలీవుడ్ రహస్య ప్రేమికులు.. ఎలాగో దొరికిపోయాం కదా అని ఏం చేశారంటే?