
సినీతారలను లక్ష్యంగా చేసుకుని కొందరు ఆకతాయిలు సైబర్ వేధింపులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ ఏఐ ప్రపంచంలో హీరోయిన్లను టార్గెట్ చేస్తున్నారు. ఏఐ ఉపయోగించి హీరోయిన్ల ఫోటోలను మార్పింగ్ చేసి నెట్టింట షేర్ చేస్తున్నారు. ఇదివరకే బాలీవుడ్, టాలీవుడ్ తారల ఫోటోస్ మార్ఫింగ్ చేసిన సంఘటనలు చూస్తున్నాం. తాజాగా మలయాళీ హీరోయిన్ అన్నా రేష్మా రాజన్ ఫోటోస్ సైతం మార్ఫింగ్ చేశారు. సోషల మీడియాలో తనపై జరుగుతున్న సైబర్ దాడిపై తీవ్రంగా స్పందించారు హీరోయిన్ అన్నా రేష్మా. తన ప్రమేయం లేకుండా తన ఫోటోను అసభ్యకరంగా మార్పింగ్ చేసి ఇన్ స్టాలో షేర్ చేసిన ఓ వ్యక్తిపై ఆమె మండిపడ్డారు. ఈమేరకు అతడి ఇన్ స్టా ఖాతా వివరాలను బహిర్గతం చేస్తూ కేరళ పోలీసులకు, సైబర్ సెల్ కు ఆమె ఫిర్యాదు చేశారు.
ఎక్కువ మంది చదివినవి : S Janaki: ఆ ఒక్క పాట.. జానకమ్మ స్వరంలో మళ్లీ మళ్లీ వినాలనిపించే మెలోడీ.. అప్పుడు ఇప్పుడు యూత్ ఫేవరేట్ సాంగ్..
“ఈ నీచమైన చర్య నా గౌరవానికి, వ్యక్తిగత ప్రైవసీకి తీవ్ర భంగం కలిగించింది. ఇలాంటి అసభ్యకర కంటెంట్ ను సృష్టించేవారైనా .. దానిని ఇతరులతో పంచుకునే వారైనా చట్టానికి సమాధానం చెప్పాల్సిందే. ఈ ఇన్ స్టా ఖాతాపై అధికారికంగా ఫిర్యాదు చేశాను. నాకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటాన్ని ఆపను. చట్టపరంగా ముందడుగు వేస్తాను ” అంటూ తన ఇన్ స్టాలో రాసుకొచ్చింది. ప్రస్తుతం అన్నా రేష్మా రాజన్ షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది.
ఎక్కువ మంది చదివినవి : Singer S Janaki : పుట్టింది రేపల్లే పల్లపట్లలో.. పెరిగింది కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో.. జానకమ్మ ప్రస్థానం ఇదే..
అయితే అన్నా రేష్మా రాజన్ ఇలా సైబర్ దాడికి గురికావడం ఇది మొదటిసారి కాదు. గతంలో ఆమె ధరించిన దుస్తులను లక్ష్యంగా చేసుకుని నెటిజన్స్ విమర్శలు గుప్పించారు. అలాగే ఆమె బాడీ షేమింగ్ కు గురయ్యారు. ఇక ఇప్పుడు మరోసారి ఆమె ఫోటోలను మార్ఫింగ్ చేశారు. 2017లో లీజో జోస్ పెల్లిస్సేరి దర్శకత్వం వహించిన బ్లాక్ బస్టర్ హిట్ అంగమాలి డైరీస్ మూవీతో వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత ఆమె మలయాళంలో పలు చిత్రాల్లో నటించింది. సోషల్ మీడియాలో అన్నా రాజన్ చాలా పాపులర్.
ఎక్కువ మంది చదివినవి : Vikram Chiyaan : ఆ హీరోయిన్ దేవత.. చాలా మిస్ అవుతున్నాను.. హీరో విక్రమ్ కామెంట్స్..
ఎక్కువ మంది చదివినవి : OTT Cinema : అడవిలో అమ్మాయి మరణం.. ఓటీటీని అల్లాడిస్తున్న థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ చూడొచ్చు..