ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘యాత్ర’. ఈ సినిమాకి మహి.వి.రాఘవ దర్శకుడు. మలయాళ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ దక్కించుకుంది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి సీక్వెల్ రూపొందించే పనిలో ఉన్నాడట దర్శకుడు.
తాజాగా విడుదలైన ఎన్నికల ఫలితాల్లో వైఎస్ జగన్ అఖండ విజయం సాధించడంతో ఆయన పాదయాత్రను ‘యాత్ర 2’ పేరుతో తెరకెక్కించాలని చూస్తున్నాడట. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలుపుతూ జగన్ కి శుభాకాంక్షలు చెప్పారు.
Congratulations to @ysjagan @YSRCParty Anna a truly deserving victory. As promised Hope you deliver more than Y S Rajasekhar Reddy Garu. You have a written and made story worth telling.. 🙂 #yatra2 @ShivaMeka pic.twitter.com/1BI6ArOMFh
— Mahi Vraghav (@MahiVraghav) May 23, 2019