‘సరిలేరు నీకెవ్వరు’ ట్విట్టర్ టాక్: బొమ్మ దద్దరిల్లిపోయింది

| Edited By:

Jan 11, 2020 | 6:59 AM

సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా ఇవాళే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకొని ఎప్పటినుంచో వేయి కళ్లతో ఎదురుచూస్తోన్న ఫ్యాన్స్.. ప్రీమియర్ షోలకు వెళ్లి సోషల్ మీడియాలో బొమ్మ అదిరిపోయిందంటూ కామెంట్లు పెడుతున్నారు. మహేష్ బాబు, ప్రకాష్ రాజ్, విజయశాంతి ఎపిసోడ్‌లు అరాచకమని.. కామెడీ అద్భుతంగా ఉందని, దేవీ శ్రీ […]

సరిలేరు నీకెవ్వరు ట్విట్టర్ టాక్: బొమ్మ దద్దరిల్లిపోయింది
Follow us on

సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా ఇవాళే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకొని ఎప్పటినుంచో వేయి కళ్లతో ఎదురుచూస్తోన్న ఫ్యాన్స్.. ప్రీమియర్ షోలకు వెళ్లి సోషల్ మీడియాలో బొమ్మ అదిరిపోయిందంటూ కామెంట్లు పెడుతున్నారు. మహేష్ బాబు, ప్రకాష్ రాజ్, విజయశాంతి ఎపిసోడ్‌లు అరాచకమని.. కామెడీ అద్భుతంగా ఉందని, దేవీ శ్రీ ప్రసాద్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయిందని వారు కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి మహేష్ బాబు కెరీర్‌లో నెవ్వెర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్ సినిమా అంటూ ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు. అంతేకాదు ఈ సినిమాలో మహేష్ బాబు డ్యాన్స్‌కు థియేటర్లో పూనకాలని, ట్రైన్ కామెడీ అయితే అదరగొట్టిదంటూ  తమ రివ్యూలను ఇస్తున్నారు. మొత్తానికి మహేష్‌కు అనిల్ అదిరిపోయే హిట్ ఇచ్చాడని వారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

https://twitter.com/freakvamshi024/status/1215763110419562496

https://twitter.com/Dhfm55578789/status/1215745357742653440

https://twitter.com/UrstrulyDevs/status/1215743487624110080