వాడే మగాడు.. మహిళలపై మహేష్ పవర్‌ఫుల్ డైలాగ్స్..!

| Edited By:

Nov 30, 2019 | 8:13 PM

ప్రస్తుతం హైదరాబాద్‌లో.. ప్రియాంకా రెడ్డి మర్డర్ కేసు హాట్ టాపిక్‌గా నిలుస్తోంది. అంత్యంత కిరాతకంగా.. ఆమెను అత్యాచారం చేసి.. హత్య చేసిన వైనం… మనసున్న ప్రతీ మానవుడిని కలిచివేసింది. ఈ హత్యపై అటు రాజకీయ నాయకులు.. ఇటు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు స్పందించారు. ఇది అత్యంత కిరాతమైన చర్యగా పేర్కొన్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. కాగా.. ఈ హత్యా ఉదంతంపై.. మహేష్ బాబు ఓ సాంగ్ రూపంలో.. మహిళల అఘాయిత్యాలపై […]

వాడే మగాడు.. మహిళలపై మహేష్ పవర్‌ఫుల్ డైలాగ్స్..!
Follow us on

ప్రస్తుతం హైదరాబాద్‌లో.. ప్రియాంకా రెడ్డి మర్డర్ కేసు హాట్ టాపిక్‌గా నిలుస్తోంది. అంత్యంత కిరాతకంగా.. ఆమెను అత్యాచారం చేసి.. హత్య చేసిన వైనం… మనసున్న ప్రతీ మానవుడిని కలిచివేసింది. ఈ హత్యపై అటు రాజకీయ నాయకులు.. ఇటు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు స్పందించారు. ఇది అత్యంత కిరాతమైన చర్యగా పేర్కొన్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు.

కాగా.. ఈ హత్యా ఉదంతంపై.. మహేష్ బాబు ఓ సాంగ్ రూపంలో.. మహిళల అఘాయిత్యాలపై ఓ వాయిస్‌ ఓవర్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్ మారుతోంది. ఈ సాంగ్ వింటుంటే.. హృదయం ద్రవిస్తోంది. ఎంతో బాధగా మహేష్ ఈ వాయిస్ ఓవర్ చెప్పినట్టు తెలుస్తోంది. అదేంటో మీరూ చదవండి.

ఎవరి కళ్లలో సంస్కారం సూర్యకాంతిలా మెరుస్తుందో..
ఎవరి మాట మన్ననగా ఉంటుందో..
ఎవరి మనసు మెత్తగా ఉంటుందో..
ఎవరి ప్రవర్తన మర్యాదగా ఉంటుందో..
ఎవరికి ఆడవాళ్లంటే హృదయంలో అభిమానం.. సమాజంలో గౌరవం ఉంటాయో..
ఎవరు వాళ్ల శరీరానికి, మనసుకి విలువిస్తారో.
వారి ఆత్మగౌరవానికి తోడుగా నిలుస్తారో..
ఎవరి మగువ కూడా మనిషే అని ఒక్క క్షణం కూడా మరిచిపోరో..
స్త్రీకి శక్తింది.. గుర్తింపు, గౌరవం ఉండాలని ఎవరు అనుకుంటారో..
ఎవరికి దగ్గరగా ఉంటే.. వాళ్లకి ప్రమాదం దూరంగా పారిపోతుందని నమ్మకం ఉంటుందో..
అలాంటి వాడు స్త్రీకి నిజమైన స్నేహితుడు, ఆత్మీయుడు, సహచరుడు..
ఒక్క మాటలో చెప్పాలంటే.. వాడే మొగాడు.