ఆ తర్వాతే రిటైర్ అవుతా – రాజమౌళీ

|

Mar 14, 2019 | 3:20 PM

రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు రాజమౌళి రూపొందించే ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ ఈరోజు ఉదయం జరిగింది. కాసేపు మీడియా ప్రతినిధులతో ముచ్చటించిన టీం సినిమా గురించి, తారాగణం గురించి తెలిపారు. అంతేకాదు తన డ్రీం ప్రాజెక్ట్స్ గురించి కూడా మీడియాతో పంచుకున్నారు రాజమౌళి. ‘మహాభారతం’ సినిమా రాజమౌళి డ్రీం ప్రాజెక్ట్ అని అందరికి తెలిసిన విషయమే. ఈసారి కూడా ఆ ప్రస్తావన రావడంతో ఆయన ఆ సినిమా […]

ఆ తర్వాతే రిటైర్ అవుతా - రాజమౌళీ
Follow us on

రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు రాజమౌళి రూపొందించే ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ ఈరోజు ఉదయం జరిగింది. కాసేపు మీడియా ప్రతినిధులతో ముచ్చటించిన టీం సినిమా గురించి, తారాగణం గురించి తెలిపారు. అంతేకాదు తన డ్రీం ప్రాజెక్ట్స్ గురించి కూడా మీడియాతో పంచుకున్నారు రాజమౌళి. ‘మహాభారతం’ సినిమా రాజమౌళి డ్రీం ప్రాజెక్ట్ అని అందరికి తెలిసిన విషయమే. ఈసారి కూడా ఆ ప్రస్తావన రావడంతో ఆయన ఆ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీడియాతో చెప్పారు.

‘మహాభారతం’ సినిమాగా తీయడం తన జీవిత లక్ష్యం అని.. ఒకవేళ తీసే సాహసం చేస్తే కని విని ఎరగని స్థాయిలో దాన్ని తీసి తర్వాత సినిమాల నుంచి రిటైర్ అయిపోతాననే తరహాలో ఆయన మాట్లాడడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఎప్పటి నుంచో దీని మీద కథనాలు రావడంతో ఆయన ఇలా రియాక్ట్ అయి ఉంటాడని అందరూ అంటున్నారు. ఇక ఒకటి మాత్రం స్పష్టం అయింది రాజమౌళికి ఇప్పట్లో ‘మహాభారతం’ తీసే ఆలోచన లేదు. అంతేకాదు ఇప్పటికే పలు భాషల్లో ‘మహాభారతం’ సినిమా కోసం రంగం సిద్ధం చేస్తున్నారు. 100 కోట్లు కాదు.. దాదాపు 1000 కోట్లుతో భారీ తారాగణంతో చిత్రాన్ని నిర్మించాలి.. సో ఒకవేళ మనం దాన్ని చూడాలి అని అనుకున్నా సంవత్సరాలు వేచి చూడాలి.