AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monalisa: వాళ్లిద్దరంటే చాలా ఇష్టం.. సినిమా ఆఫర్‌పై తేనెకళ్ల సుందరి మోనాలిసా ఏం చెప్పిందంటే..

మహా కుంభమేళాలో పూసలమ్ముకుంటూ కనిపించి దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది మోనాలిసా. కుంభమేళా మోనాలిసా అంటూ అందరూ ముద్దుగా పిలుచుకుంటున్నారు. ఏ క్షణాన అయితే ఆమె ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారో..అప్పటి నుంచి ఇప్పటి వరకూ వైరల్ అవుతూనే ఉన్నాయి. పైగా రోజుకో వార్తతో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది ఈ యువతి.

Monalisa: వాళ్లిద్దరంటే చాలా ఇష్టం.. సినిమా ఆఫర్‌పై తేనెకళ్ల సుందరి మోనాలిసా ఏం చెప్పిందంటే..
Monalisa
Shaik Madar Saheb
|

Updated on: Feb 02, 2025 | 12:51 PM

Share

మహా కుంభమేళాలో పూసలమ్ముకుంటూ కనిపించి దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది మోనాలిసా. కుంభమేళా మోనాలిసా అంటూ అందరూ ముద్దుగా పిలుచుకుంటున్నారు. ఏ క్షణాన అయితే ఆమె ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారో..అప్పటి నుంచి ఇప్పటి వరకూ వైరల్ అవుతూనే ఉన్నాయి. పైగా రోజుకో వార్తతో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది ఈ యువతి. అటు సినిమా వాళ్లనీ ఇదే విధంగా అట్రాక్ట్ చేసింది. ఆమె కళ్లు చూసే అందరూ ఫిదా అయిపోయారు. ఇప్పుడు ఆమెకి ఉన్న క్రేజ్‌ని చూసి బాలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది. ది డైరీ ఆఫ్ మణిపూర్ చిత్రంలో ఓ పాత్రలో నటించనుంది మోనాలిసా. ఈ మేరకు అగ్రిమెంట్‌పై సంతకం కూడా చేసింది. ఇక షూటింగ్‌కి వెళ్లడమే తరువాయి. అసలు ఎక్కడి మోనాలిసా..ఎక్కడి బాలీవుడ్. లక్ అంటే అలా ఉంటుంది మరి. ఎవరిని ఎప్పుడు ఎక్కడికి తీసుకెళ్లి కూర్చోబెడుతుందో ఎవరూ ఊహించలేరు. ఇప్పుడు మోనాలిసా విషయంలో అదే జరిగింది.

అయితే..సినిమా ఆఫర్‌పై ఈ తేనెకళ్ల సుందరి స్పందించింది. ఈ రియాక్షనే ఇప్పుడు వైరల్ అవుతోంది. “నిజం చెప్పాలంటే..ఎప్పుడెప్పుడు హీరోయిన్ అవుతానా అని ఎదురు చూశా. నాకు యాక్టింగ్ అన్నా డ్యాన్స్ అన్నా మహా ఇష్టం” అని అంటోంది మోనాలిసా. మరి నీకు ఏ యాక్టర్లు అంటే ఇష్టం అని అడిగితే..”నాకు మా అమ్మ నాన్నే బాగా ఇష్టం” అని ఆన్సర్ చెబుతూనే..సోనాక్షి సిన్హా, సల్మాన్ ఖాన్ అంటే ఇష్టమంటూ తన మనసులో మాట బయటపెట్టింది. అయితే..ఒక్కసారిగా వచ్చిన ఈ ఫేమ్‌తో కొన్ని ఇబ్బందులూ ఎదురవుతున్నాయని చెబుతోంది మోనాలిసా. అంతా వచ్చి పదేపదే ఫొటోలు, వీడియోలు అడుగుతున్నారని, ఇది ఇబ్బంది కలిగిస్తోందని అంటోంది. కొందరైతే తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ని హ్యాక్ చేశారని చెప్పుకొచ్చింది. తన పేరిట ఎన్నో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేశారని పేర్కొంది..

కుంభమేళాలో అందరూ వచ్చి ఇబ్బంది పెడుతున్నారనే..ఇంటికి వచ్చి ఇలా ఎవరి కంటాపడకుండా దాక్కుని ఉంటున్నానని చెబుతోంది మోనాలిసా. కానీ..ఇప్పుడు అదృష్టం తనను వెతుక్కుని వచ్చి మరీ తలుపు తట్టిందని, ఇకపై పూర్తిగా యాక్టింగ్‌ నేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపింది. ఇది తన లైఫ్‌లో కొత్త ఛాప్టర్ అని, చదవడం రాయడం రాకపోయినా..సంతకం చేయడం నేర్చుకున్నానని అంటోంది. ఇప్పుడు సినిమా అగ్రిమెంట్‌పై సంతకం చేయడం సంతోషంగా ఉందని తన ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది కుంభమేళా వైరల్ గర్ల్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!
రూ.10 లక్షల లోపు బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!
రూ.10 లక్షల లోపు బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!
నాగబాబు చేతుల మీదుగా 'సిరివెన్నెల స్మృతివనం'కు శంకుస్థాపన
నాగబాబు చేతుల మీదుగా 'సిరివెన్నెల స్మృతివనం'కు శంకుస్థాపన
ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల పేరుతో భారీ స్కామ్..సైబర్ పోలీసుల వార్నింగ్
ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల పేరుతో భారీ స్కామ్..సైబర్ పోలీసుల వార్నింగ్
రైళ్లలో ఆదమరిచినిద్రపోతున్నారా?ఇలాంటి రైల్వే దొంగలుంటారు జాగ్రత్త
రైళ్లలో ఆదమరిచినిద్రపోతున్నారా?ఇలాంటి రైల్వే దొంగలుంటారు జాగ్రత్త
ఇల్లు కొనడం తెలివితక్కువ పని.. అద్దెకు ఉండటమే తెలివైన పనా?
ఇల్లు కొనడం తెలివితక్కువ పని.. అద్దెకు ఉండటమే తెలివైన పనా?
మహానటి సావిత్రికి మద్యం అలవాటు చేసింది ఆ నటుడేనని తెలుసా?
మహానటి సావిత్రికి మద్యం అలవాటు చేసింది ఆ నటుడేనని తెలుసా?
మీ గోళ్లు ఇలా ఉన్నాయా? అయితే మీ భవిష్యత్ గురించి ఈ నిజం..
మీ గోళ్లు ఇలా ఉన్నాయా? అయితే మీ భవిష్యత్ గురించి ఈ నిజం..