Maa Elections 2021: మా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత విష్ణు తొలి నిర్ణయం.. మహిళల భద్రత కోసం..

|

Oct 22, 2021 | 9:48 PM

Maa Elections 2021: మా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఎంత రచ్చ జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ గందరగోళంలోనే ఎన్నికలు పూర్తయ్యాయి, మంచు విష్ణు..

Maa Elections 2021: మా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత విష్ణు తొలి నిర్ణయం.. మహిళల భద్రత కోసం..
Manchu Vishnu
Follow us on

Maa Elections 2021: మా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఎంత రచ్చ జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ గందరగోళంలోనే ఎన్నికలు పూర్తయ్యాయి, మంచు విష్ణు అధ్యక్షుడిగా కూడా ఎన్నికయ్యారు. ఇదిలా ఉంటే మా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచు విష్ణు ఎన్నో హామీలను ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక తాజాగా విష్ణు మేనిఫెస్టోలో ప్రస్తావించిన అంశాలను నెరవేర్చే పనిలో పడ్డారు విష్ణు. ఈ క్రమంలోనే తొలి నిర్ణయాన్ని శుక్రవారం ప్రకటించారు.

‘మా’లో మహిళల భద్రత కోసం ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు విష్ణు తెలిపారు. ఈ కమిటీకి ప్రముఖ సామాజిక కార్యకర్త సునీతా కృష్ణన్‌ గౌరవ సలహాదారుగా ఉంటారని ట్విట్టర్‌ వేదికగా తెలిపారు. ఈ సందర్భంగా విష్ణు ట్వీట్‌ చేస్తూ.. ‘‘విమెన్‌ ఎంపవర్‌మెంట్‌ అండ్‌ గ్రీవెన్స్‌ సెల్‌’ పేరుతో కమిటీని ఏర్పాటు చేశామని తెలియజేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. ఈ కమిటీ మహిళా సాధికారత కోసం పనిచేస్తుంది.

ఈ కమిటీకి సలహాదారుగా పనిచేయనున్న పద్మశ్రీ సునీతా కృష్ణన్‌కు నా ధన్యవాదాలు. ఈ కమిటీలో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉంటారు. వారి వివరాలను త్వరలోనే ప్రకటిస్తాం. ఎక్కువ మంది మహిళలను మా లో భాగస్వామ్యులను చేయడమే మా లక్ష్యం. దానికి ఈ కమిటీ ద్వారా తొలి అడుగు వేస్తున్నాం’ అంటూ విష్ణు పేర్కొన్నారు.

మంచు విష్ణు ట్వీట్..

Also Read: Viral Video: కరీంనగర్‌ జిల్లాలో నీరు ఆకాశంలోకి వెళ్లిపోతూ కనువిందు చేసిన అద్భుత దృశ్యం.. వీడియో

Viral Video: 29ఏళ్ల యువకుడికి 44ఏళ్ల గర్ల్‌ఫ్రెండ్‌..! నెలకు 11లక్షల జీతం.. వీడియో

Crime news: ఏపీ గుంటూరులో మరో దారుణం.. ఇంజినీరింగ్‌ విద్యార్థినిపై అత్యాచారయత్నం.. కర్రలతో కొట్టి..