ప్రభాస్ కోసం లెజండరీ దర్శకుడు.. ఏడు సంవత్సరాల తరువాత రీఎంట్రీ

| Edited By:

Sep 21, 2020 | 3:10 PM

మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా ఓ భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే

ప్రభాస్ కోసం లెజండరీ దర్శకుడు.. ఏడు సంవత్సరాల తరువాత రీఎంట్రీ
Follow us on

Prabhas 21 movie: మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా ఓ భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్ నిర్మిస్తోన్న ఈ మూవీలో దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన మరో ఆసక్తికర విషయాన్ని మూవీ యూనిట్‌ అధికారికంగా వెల్లడించింది. ఈ ప్రాజెక్ట్‌లో లెజండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు భాగం అయ్యారు. ఈ మూవీ కోసం ఆయన మెంటర్‌గా పనిచేయనున్నట్లు మూవీ యూనిట్ తెలిపింది. కాగా ఈ సినిమా టైమ్ మెషీన్ నేపథ్యంలో తెరకెక్కబోతున్నట్లు ఆ మధ్యన వార్తలు రాగా ఇప్పుడొచ్చిన ఈ ప్రకటన వాటికి మరింత బలం చేకూరుస్తోంది.

అయితే నీతి-నిజాయితీ మూవీతో దర్శకుడిగా పరిచయం అయిన సింగీతం శ్రీనివాసరావు.. త్రిలోకసుందరి, తరం మారింది, మయూరి, అమావాస్య చంద్రుడు, పుష్పక విమానం, ఆదిత్య 369, భైరవ ద్వీపం వంటి పలు సంచలన చిత్రాలకు దర్శకత్వం వహించారు. చివరిసారిగా 2013లో వెల్‌కమ్ ఒబామా అనే చిత్రానికి ఆయన దర్శకత్వం వహించారు. ఇక ఏడు సంవత్సరాల తరువాత మళ్లీ ఇప్పుడు ఆయన మెగా ఫోన్ పట్టనున్నారు. కాగా సై-ఫై కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కనుంది. దాదాపు 300కోట్లతో పాన్ ఇండియా మూవీగా ప్రభాస్ 21వ చిత్రం తెరకెక్కనుంది.

Read More:

వైఎస్‌ వివేకా హత్య కేసు: ఇవాళ ఆ ఆరుగురిని ప్రశ్నించనున్న సీబీఐ

Nishabdham trailer: అంచనాలు పెంచేసిన ‘నిశ్శబ్దం’ ట్రైలర్