Actress Kriti Sanon : మహేష్ హీరోయిన్ కవితకు ఫిదా అవుతున్న నెటిజన్లు.. వైరల్‌‌‌‌గా మారిన కృతిసనన్ పోస్ట్

|

Jan 15, 2021 | 8:54 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ' 1 నేనొక్కడినే ' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ కృతిసనన్.

Actress Kriti Sanon : మహేష్ హీరోయిన్ కవితకు ఫిదా అవుతున్న నెటిజన్లు.. వైరల్‌‌‌‌గా మారిన కృతిసనన్ పోస్ట్
Follow us on

Actress Kriti Sanon : సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘ 1 నేనొక్కడినే ‘ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ కృతిసనన్. ఆతర్వాత తెలుగులో నాగచైతన్య నటించిన దోచేయ్ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా ప్రేక్షకులను అలరించలేక పోయింది. ఈ సినిమా తర్వాత ఈ బ్యూటీ బాలీవుడ్ కు తిరిగి చెక్కేసింది. అక్కడ వరుస సినిమాలతో బిజీ హీరోయిన్ అయిపోయింది. కాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

తన సినిమా అప్డేట్స్ తో పాటు హాట్ హాట్ ఫోటోలను , వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది కృతిసనన్. తాజాగా ఈ బ్యూటీ ఓ కవిత రాసింది. ఓ అందమైన ఫోటోను పోస్ట్ చేసిన కృతిసనన్ ” ‘ఆమె కండ్లు లోతైన‌వి, నిజాయితీతో కూడుకున్న‌వి.. అవి ఎప్పుడూ మార‌వు..అలాంటి ప్రేమ కోసం ఆమె వేచి చూస్తోంది..’అంటూ కృతిస‌న‌న్ రాసుకొచ్చింది. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా ఈ అమ్మడు గతంలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో డేటింగ్ చేసిన విషయం తెలిసిందే..ప్రస్తుతం అక్షయ్ కుమార్ నటిస్తున్న బచ్చన్ పాండే సినిమాలో నటిస్తుంది కృతిసనన్.