Ravi Teja KRAck Movie : న్యూఇయర్ కానుకగా రవితేజ ‘క్రాక్’ మూవీ మాస్ కా బాప్ ట్రైలర్..

మాస్ రాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం క్రాక్ ఈ సినిమా తో ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు రవితేజ. అనీల్ రావిపూడి..

Ravi Teja KRAck Movie : న్యూఇయర్ కానుకగా రవితేజ 'క్రాక్' మూవీ మాస్ కా బాప్ ట్రైలర్..
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 31, 2020 | 8:47 PM

Ravi Teja KRAck Movie : మాస్ రాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం క్రాక్ ఈ సినిమా తో ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు రవితేజ. అనీల్ రావిపూడి తెరకెక్కించిన రాజా ది గ్రేట్ సినిమా తర్వాత రవితేజ సరైన సక్సెస్ చూడలేదు. దాంతో ఈ సినిమా పైన భారీ ఆశలే పెట్టుకున్నారు రవితేజ అభిమానులు. ఇక ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తుంది. ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమా ట్రైలర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు చిత్రయూనిట్. న్యూఇయర్ కానుకగా మాస్ కా బాప్ ట్రైలర్ ను రెడీ చేశారు. డాన్ శీను’ ‘బలుపు’ వంటి హిట్స్ తర్వాత గోపిచంద్ మ‌లినేనితో క‌లిసి క్రాక్ సినిమా చేస్తున్న ర‌వితేజకు ఈ సినిమా హిట్ ఇవ్వడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక మాస్ కా బాప్ ‘క్రాక్’ ట్రైలర్ అంటూ ప్రమోషన్ చేస్తున్న మేక‌ర్స్ రేపు ఉద‌యం 11 గంట‌ల‌కు చిత్ర ట్రైల‌ర్‌ని విడుద‌ల చేయ‌నున్నారు. ఈ సినిమాలో తమిళ నటుడు, దర్శకుడు సముద్రఖని మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. థమన్ స్వరాలు అందిస్తున్న ”క్రాక్’ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేస్తున్నారు.