సూర్య.. తమిళంతో పాటు తెలుగులోనూ ఎందరో అభిమానులను సంపాదించుకున్న ఈ విలక్షణ నటుడి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సినిమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటాడీ కోలీవుడ్ స్టార్ హీరో. పదేళ్ల క్రితం స్థాపించిన అగరం ఫౌండేషన్ పేరిట పలు పేద విద్యార్థులకు ఉచితంగా విద్య నందిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. కాగా ఇటీవల ఈటీ సినిమాతో మనముందుకొచ్చిన సూర్య (Suriya) ప్రస్తుతం వైవిధ్యమైన సినిమాలు తీసే బాల దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఇంకా టైటిల్ ఖరారుచేయని ఈ చిత్రం షూటింగ్ గత కొన్ని రోజులుగా కన్యాకుమారి సముద్ర తీర ప్రాంతంలో జరుగుతుంది. కాగా ఈ చిత్రంలో అతను మత్స్యకారుడు (Fishermen) పాత్రలో నటిస్తున్నాడు.
వాటిని కూల్చివేయకుండా..
కాగా ఈ సినిమాలో జాలర్లు నివసించేలా సహజంగా ఉండే ఇళ్లు, గుడిసెలను నిర్మిస్తున్నారట. భారీ ఖర్చుతో నాణ్యమైన సెట్స్ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, షూటింగ్ పూర్తయిన తర్వాత ఈ గుడిసెల సెట్‌ను కూల్చివేయకుండా ఇల్లు లేని పేద మత్య్యకారులకు ఉచితంగా ఇవ్వాలని సూర్య నిర్ణయం తీసుకున్నారట. ఆయన తీసుకున్న ఈ నిర్ణయంతో అభిమానులు, ఆ ప్రాంత ప్రజలు అభినందనలు తెలుపుతున్నారు. దీంతో సూర్య మంచి మనసుని అందరూ అభినందిస్తున్నారు. సోషల్ మీడియాలో సూర్య గొప్పతనాన్ని వివరిస్తూ ఆయన అభిమానులు పోస్టులు షేర్ చేస్తున్నారు.
Also Read: Chocolate: చాక్లెట్ కోసం నదినే ఈది.. సరిహద్దు దాటి భారత్ లోకి వచ్చిన బాలుడు… 15 రోజులు రిమాండ్
Pakistan: పంజాబ్ డిప్యూటీ స్పీకర్‌ను చెప్పుతో కొట్టి.. జుట్టు పట్టుకుని ఈడ్చేసిన పీటీఐ ఎమ్మెల్యేలు!